Site icon HashtagU Telugu

CBI : లంచం కేసులో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఏరియా మేనేజర్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

CBI Takes Over Probe

CBI Takes Over Probe

లంచం కేసులో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఏరియా మేనేజర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మహారాష్ట్రలోని యవతమాల్ జిల్లాలో ఘోన్సా ఓపెన్ కాస్ట్ మైన్ (OCM), వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) సబ్ ఏరియా మేనేజర్‌ను గౌత‌మ్ బ‌సుత్జార్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డబ్ల్యుసిఎల్ నుంచి బొగ్గును ఎత్తివేసేందుకు డెలివరీ ఆర్డర్ ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,23,610 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఏరియా మేనేజ‌ర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఘోన్సా OCM, WCL, వాని నార్త్ ఏరియా నుండి 8200 MT బొగ్గును ఎత్తివేసేందుకు ఫిర్యాదుదారు సంస్థకు అధికారం ఉందని, అయితే సంస్థ 4623 MT బొగ్గును మాత్రమే లిఫ్ట్ చేయగలదని .. అయితే ఏరియా మేనేజ‌ర్ కొత్త డెలివరీ ఆర్డర్‌ను ఇవ్వడానికి నిరాకరించాడని.. 2500 MT బొగ్గు కోసం కొత్త డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి రూ. 3,19,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఫిర్యాదుదారుడు ఆరోపించారు.

ఫిర్యాదుదారుడు నుండి మొదటి విడతగా రూ. 1,00,000 లంచం డిమాండ్ చేసి.. లంచం తీసుకుంటుండ‌గా.. సీబీఐ నిందితుడు బసుత్కర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడి అధికారిక, నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. అరెస్టయిన నిందితుడు గౌతమ్ బసుత్కర్‌ను యవత్మాల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఫిబ్రవరి 8 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.