Caste Census : వచ్చే ఏడాది నుండి కులగణన ప్రారంభం.. 36 ప్రశ్నలతో సమాచారం సేకరణ!

Caste Census : వచ్చే ఏడాది అక్టోబర్‌ 1న హిమాలయ ప్రాంతాల్లో ఈ గణన ప్రారంభమై 2027 మార్చి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు

Published By: HashtagU Telugu Desk
Population Count And Caste

Population Count And Caste

ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా గణన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొదలుపెట్టనున్నది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 1న హిమాలయ ప్రాంతాల్లో ఈ గణన ప్రారంభమై 2027 మార్చి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈసారి జనాభా లెక్కలతో పాటు కులగణన (Caste Census) కూడా చేపట్టనున్నారు. 2011 గణన తరువాత దేశంలో జీవన ప్రమాణాలు, సాంకేతికత, విద్య, వనరులు మొదలైన అనేక అంశాల్లో మార్పులు వచ్చాయి. అందుకే ఈ గణనకు సంబంధించిన ప్రశ్నావళిని సమగ్రమైనదిగా రూపొందించేందుకు రిజిస్ట్రార్ జనరల్‌ అండ్ సెన్సస్‌ కమిషనర్‌ కసరత్తు చేస్తున్నారు.

Akhil Wedding : అట్టహాసంగా అఖిల్ పెళ్లి వేడుక..అతిధులు ఎవరెవరు వచ్చారంటే !!

ఈసారి సెన్సస్‌లో దాదాపు 36 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్‌ (Questionnaire with 36 questions) ద్వారా ప్రతి కుటుంబాన్ని సమగ్రమైన విధంగా అధ్యయనం చేయనున్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వారి విద్యా స్థాయి, ఉపాధి పరిస్థితి, కులం, ఆస్తి వివరాలు వంటి అనేక అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంటిలో ఎన్ని మొబైల్స్ ఉన్నాయన్నది నుంచి ఇంటర్‌నెట్, టాయిలెట్లు, వాహనాలు, వంట గది, వాడే ఇంధనం వరకు సమాచారం సేకరించనున్నారు. ఇళ్లు స్వంతమా, అద్దె ఇల్లు కాకపోతే గోడలు, పైకప్పు ఎలా ఉన్నాయి అన్న వివరాల వరకు నమోదు చేస్తారు.

ఈ గణన కార్యాచరణను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్రం మూడు దశలుగా శిక్షణ ప్రణాళిక రూపొందించింది. మొదట అపెక్స్‌ స్థాయిలో శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ పొందిన వారు తదుపరి స్థాయికి మరియు చివరికి క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రశ్నావళిపై సరైన అవగాహన కలిగిన సిబ్బందిని తయారు చేయడమే లక్ష్యంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా శిక్షణ పొందిన సిబ్బందిద్వారానే సమాచార సేకరణ జరగనుంది. ఈ గణన ద్వారానే ప్రభుత్వ పాలనకు అవసరమైన అనేక ముఖ్యమైన డేటా సిద్ధం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

  Last Updated: 06 Jun 2025, 11:44 AM IST