ఈ మధ్యకాలంలో చాలామంది డ్రైఫ్రూట్స్(Dry Fruits) తింటున్నారు వాటిలో జీడిపప్పు(Cashew Nuts) అంటే పిల్లలకు, పెద్దవారికి ఎంతో ఇష్టం. జీడిపప్పుతో ప్రోటీన్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ జీడిపప్పును కొనాలి అంటే మామూలుగా kg జీడిపప్పు ధర మన దగ్గర 800 రూపాయల నుండి 1200 రూపాయల వరకు ఉంటుంది. హోల్ సెల్ లో కొంటె 600 నుండి 700 వరకు దొరుకుతుంది. కానీ జార్ఖండ్(Jharkhand) లోని నాలా(Nala) అనే గ్రామంలో జీడిపప్పు ధర kg 15 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఉంటుంది. మన ఊరిలో పండ్లు, కూరగాయలు రోడ్ల పక్కన పెట్టి అమ్మినట్లుగా నాలాలో జీడిపప్పును రోడ్ల పైన పెట్టి అమ్ముతుంటారు.
చుట్టు పక్కల రాష్ట్రాల నుండి చిరు వ్యాపారస్తులు వచ్చి నాలాలో జీడిపప్పును కొనుక్కుంటూ ఉంటారు. కావున ఈ సిటీని క్యాషూ సిటీ ఆఫ్ జార్ఖండ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అసలు ఎక్కువ ధర ఉండే జీడిపప్పు అక్కడ తక్కువ ధరకు లభించడానికి ముఖ్య కారణం కొన్ని సంవత్సరాల కింద నాలాలో ఎటువంటి పంటలు సరిగా పండేవి కావు. అప్పుడు భూసార పరీక్షలు జరిపి ఆ నేలలో జీడిపప్పు బాగా పండుతుందని చెప్పారు శాస్త్రవేత్తలు.
.
అందుకని అక్కడి రైతులకు మొదట కొన్ని జీడిగింజలను ఇచ్చి జీడిపప్పు పంటను వేశారు. మంచి లాభాలను అందుకున్నారు. ఇక అప్పటి నుండి జీడిపప్పు పంటను అక్కడ ఎక్కువగా వేస్తుంటారు. అందుకే అక్కడ జీడిపప్పు ధర తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా జీడికాయలను, జీడిపప్పును ఎక్కువగా నాలాలో పండిస్తుంటారు. అక్కడ ఆ ఊళ్ళో ఉండే వాళ్లంతా అదే జీడిపప్పుని సాగుచేసి, అమ్మి జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి మనకు ఇక్కడ ఎక్కువ ధరకు లభించే జీడిపప్పు నాలాలో తక్కువ ధరకే లభిస్తుంది. అయితే వీటిల్లో గ్రేడ్లు ఉంటాయి. మాములు నాసి రకం జీడిపప్పు నుంచి చాలా మంచి జీడిపప్పు వరకు వీటి నాణ్యతని బట్టి రేటు ఉంటుంది.
Also Read : Vasthu Tips: అక్వేరియం ఇంట్లో ఉండవచ్చా.. ఉంటే ఏ దిశగా ఉండాలి ఎన్ని చేపలు ఉండాలో తెలుసా?