Cargo Ship Hijack : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్.. రంగంలోకి నేవీ

  • Written By:
  • Updated On - January 5, 2024 / 12:35 PM IST

Cargo Ship Hijack : సముద్ర జలాల్లో ఎక్కడ చూసినా హైటెన్షన్ కనిపిస్తోంది. ఓడల హైజాకింగ్ ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా సోమాలియా దేశ సముద్ర తీరం సమీపంలో ‘MV LILA NORFOLK’ అనే కార్గో షిప్ గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ ఓడలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం ఈ  ఓడపై నిఘా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఓడ నుంచి భారతీయులను రక్షించేందుకుగానూ ఇండియన్ నేవీ యుద్ధనౌక INS చెన్నై ఇప్పటికే సోమాలియా సముద్ర తీరం వైపుగా బయలుదేరింది.

We’re now on WhatsApp. Click to Join.

మీడియా నివేదికల ప్రకారం..  ‘MV LILA NORFOLK’ అనే సరుకు రవాణా  ఓడ బ్రెజిల్‌లోని పోర్టో డు అక్యూ నుంచి బహ్రెయిన్‌లోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్‌కు బయలుదేరింది. జనవరి 11న అది బహ్రెయిన్‌‌కు చేరాల్సి ఉంది. అయితే డిసెంబర్ 30 నుంచి ఈ ఓడతో.. ‘MV LILA NORFOLK’ కంపెనీ నిర్వాహకులకు కమ్యూనికేషన్ తెగిపోయింది. యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లకు వ్యతిరేకంగా జట్టు కట్టిన 12 దేశాల జాబితాలో బహ్రెయిన్ కూడా ఉంది. దీంతో బహుశా బహ్రెయిన్‌ను టార్గెట్ చేసుకొని ఈ హైజాక్ జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని గంటల పాటు వేచి ఉండాల్సిందే.

Also Read: South Korea Vs North Korea : దక్షిణ కొరియా తీర ప్రాంతాలపైకి ఉత్తర కొరియా కాల్పులు.. హైటెన్షన్

భారత సైన్యం స్పందన ఇదీ.. 

ఈ ఘటనపై భారత మిలిటరీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హైజాక్ చేయబడిన MV LILA NORFOLK ఓడ కదలికలపై భారత నౌకాదళం విమానం నిఘా పెట్టింది. మేం ప్రతీదీ నిశితంగా గమనిస్తున్నాం. ఈ ఘటనపై మాకు గురువారం సాయంత్రం సమాచారం అందింది. సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిన ఈ నౌక లైబీరియా జెండాతో వెళ్తోందని తెలిసింది.  ఆ ఓడలో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారితో మేం కమ్యూనికేషన్ కూడా నెరుపుతున్నాం’’ అని వెల్లడించారు.