SC On Freebies : ఉచితాల‌పై `సుప్రీం` సైడ్ యాంగిల్

రాజ‌కీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాల‌ను న్యాయ‌స్థానాలు అడ్డుకోలేవ‌ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు.

  • Written By:
  • Updated On - August 17, 2022 / 10:25 PM IST

రాజ‌కీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాల‌ను న్యాయ‌స్థానాలు అడ్డుకోలేవ‌ని సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. ఈ విష‌యంలో న్యాయ‌స్థానాల ప‌రిధిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం సంక్లిష్టంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఉచితాల అంశంపై ద్రావిడ మున్నేట్ర కజగం (డిఎంకె) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా కోర్టు అడ్డుకోలేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సంక్షేమాన్ని అందించడం ప్రభుత్వ కర్తవ్యమని CJI అన్నారు.

ఎన్నికల ఫ్రీబీస్ అంశంపై డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా పేర్కొనలేమని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. ఉచిత వాగ్దానాలు విస్తృత, బహుళ ఉద్దేశాలను కలిగి ఉంటాయని పార్టీ వాదించింది. పిటిషనర్ హన్సారియా మాట్లాడుతూ.. ‘‘కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని కమిటీని వేయాలని కోరారు. డిఎంకె తరపున పి విల్సన్ మాట్లాడుతూ, కమిటీని ఏర్పాటు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము` అన్నారు.