Site icon HashtagU Telugu

Nirmala : ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేం: విపక్షాలకు నిర్మలమ్మ కౌంటర్‌

FIR Against N Sitharaman

Nirmala Sitharaman:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ ఈ ఆర్థిక ఏడాది 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌(Budget)ను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర వార్షిక బడ్జెట్‌పై విపక్ష  (Opposition) ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2024 బడ్జెట్ వివక్షపూరితంగా ఉందని, విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణలకు మంత్రి నిర్మలమ్మ కౌంటర్‌ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

బడ్జెట్‌ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్ల(All States Names)ను చెప్పలేమంటూ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదని నిర్మలా సీతారామన్ అన్నారు. మహారాష్ట్రలోని వందవన్‌లో పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. కానీ, బడ్జెట్‌లో మహారాష్ట్ర పేరును చెప్పలేదని.. అలాగని.. తమను విస్మరించారని ఆ రాష్ట్రం భావిస్తోందా? అంటూ విపక్షాలను ప్రశ్నించారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? అని నిలదీశారు. విపక్షాలది దారుణమైన ఆరోపణ అని మండిపడ్డారు. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ రాజ్యసభలో విపక్షాలపై మండిపడ్డారు. కాగా, వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన నిర్మలా సీతారమన్‌ వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రూ. 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక పద్దును ఉభయ సభల ముందుకు తీసుకెళ్లారు.

Read Also: Telangana Assembly : కేసీఆర్ గైర్హాజరీపై రేవంత్ ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్