Rajkot Airport : మొన్న ఢిల్లీ..నేడు రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ ..భారీ వర్షానికి కూలుతున్న టెర్మినల్స్

వర్షాలతో రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు షెడ్ టెంట్ కూలిపోయింది

Published By: HashtagU Telugu Desk
Rajkot Airport

Rajkot Airport

ఇటీవల కాలంలో కేంద్రం ఎంతో భారీ వ్యయం తో నిర్మించిన కట్టడాలన్నీ కూడా భారీ వర్షాలకు కురుస్తున్నాయి. కూలుతున్నాయి. మొన్న అయోధ్య ఆలయం.. నిన్న ఎయిర్ పోర్టు, వంతెనలు, నేడు వరల్డ్ క్లాస్ వందేభారత్ రైలు ఇలా అన్ని కూడా వర్షానికి కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ టెర్మినల్స్ కూలడం తో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇక మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. దీనిపై కేంద్రం ఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే..తాజాగా ఈరోజు వర్షాలతో రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షెడ్ టెంట్ కూలిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో ఈదురుగాలులతో భారీ వానలుపడుతున్నాయి. ఈ భారీ ఈదురుగాలులు, వర్షాలతో రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు షెడ్ టెంట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలియపరు. కాగా, గుజరాత్‌లోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది.

  Last Updated: 29 Jun 2024, 06:43 PM IST