Site icon HashtagU Telugu

Revanna : రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయండి.. ప్రధాని మోడీకి సిద్ధరామయ్య లేఖ

Cancel Revanna's diplomatic passport.. Siddaramaiah's letter to PM Modi

Cancel Revanna's diplomatic passport.. Siddaramaiah's letter to PM Modi

JDS MP Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్టు(Diplomatic Passport)కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రధాని మోడీ(PMinister Modi)కి లేఖ(letter) రాశారు.

We’re now on WhatsApp. Click to Join.

”ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్‌ అయిన తర్వాత ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్‌ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. క్రిమినల్‌ ప్రోసిడింగ్స్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి” అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు.

Read Also: Yash Toxic : యష్ టాక్సిక్ లో మరో బాలీవుడ్ హీరోయిన్..?

కాగా, సిద్ధరామయ్య(Siddaramaiah) రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణపై సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్‌ విచారణ అధికారులు లుక్‌ అవుట్‌, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read Also: Rain Alert : తెలుగు రాష్ట్రాలకు భారీ తూఫాన్ హెచ్చరిక..

మరోవైపు ..ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్‌(Arrest on Prajwal) వారెంట్‌ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించడం లేదని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్‌ వారెంట్‌నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు.