Amit Shah : భారత్‌పై మరోసారి కెనడా విషం కక్కింది. కెనడాలో జరిగిన సిక్కు ఉగ్రవాదుల హత్యలతో భారత హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సంబంధం ఉందని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ సంచలన ఆరోపణ చేశారు. అమెరికా మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’కు దీనిపై సమాచారం ఇచ్చి, కథనం రాయించింది తానేనని ఆయన వెల్లడించారు. ఈమేరకు వివరాలతో రాయిటర్స్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితేే కెనడా సర్కారు చేస్తున్న ఈ ఆరోపణలను భారత్ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రమూకల హత్యల వెనుక తమ పాత్ర లేదని తేల్చి చెబుతోంది.
Also Read :Nishad Yusuf : ‘కంగువ’ ఎడిటర్ నిషాద్ ఇక లేరు.. అనుమానాస్పద స్థితిలో మృతి
కెనడా పార్లమెంటులో..
కెనడా పార్లమెంటులో కూడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కెనడాలో ఖలిస్తానీలను మట్టుబెట్టాలని భారత ఏజెంట్లకు ఢిల్లీలోని అధికార వర్గాల నుంచే ఆదేశాలు అందాయని ఆయన పార్లమెంటులో చెప్పారని సమాచారం. భారత్‌లోని అధికార వర్గాల నుంచి కెనడాలోని భారత ఏజెంట్లకు ఆదేశాలు అందాయనే దానిపై కెనడా భద్రతా సంస్థలు ఆధారాలను కూడగట్టాయని ఇటీవలే ‘వాషింగ్టన్ పోస్ట్’ ఒక కథనంలో ప్రస్తావించింది. ఆ ఆదేశాలు ఇచ్చింది మరెవరో కాదు.. భారత హోం మంత్రి అమిత్‌షా(Amit Shah)నే అని తాజాగా కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.
Also Read :Military Theatre Commands : మన దేశానికి మూడు మిలిటరీ థియేటర్ కమాండ్‌లు.. ఎలా పనిచేస్తాయి ?
భారత్‌పై అక్కసుతోనే..
భారత్‌పై అక్కసుతోనే ఈవిధంగా కెనడా ఆరోపణలు చేస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కెనడాలో శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన అక్కడి ప్రభుత్వం.. భారత్‌పై నిందలు మోపుతోందనే టాక్ వినిపిస్తోంది.డేవిడ్ మారిసన్ సంచలన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. కాగా, 2023 జూన్ 18న కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ జరిగింది. అప్పటి నుంచే భారత్, కెనడా మధ్య దౌత్య యుద్ధం, ఆరోపణల యుద్ధం నడుస్తున్నాయి.