Income Tax Return: ఫారం -16 లేకున్నా ఇన్‎కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయోచ్చా? ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 09:37 AM IST

కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. జీతం పొందే వ్యక్తులు భారతదేశంలో తమ ఆదాయపు పన్ను(Income Tax Return) రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడానికి ఇది సమయం. ఫారమ్ 16 సాధారణంగా ITR ఫైల్ చేయడానికి జీతభత్యాల తరగతి వ్యక్తులు తరచుగా ఫారమ్ 16ను ఉపయోగిస్తుంటారు. కానీ ఫారమ్ 16 లేకుండానే పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఫారమ్ 16 ఉద్యోగి యొక్క పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం యొక్క సమగ్ర ఖాతాను అందిస్తుంది, అయితే కొంతమంది ఉద్యోగులు వారి జీతం పన్ను పరిధిలోకి రాదని చాలాసార్లు చూశారు. అలాంటి సందర్భాలలో, ఫారమ్ 16 లేకుండానే మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.

ఫారమ్ -16 అంటే ఏమిటి?
ఫారమ్ 16 అనేది ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఒక ముఖ్యమైన పత్రం. ఎందుకంటే ఇది వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం, తగ్గింపుల వివరాలు, TDS సమాచారం, పెట్టుబడులను అందిస్తుంది. దీన్ని బట్టి ఆ వ్యక్తం మొత్తం ఎంత డబ్బు ఖర్చు చేశాడన్నది సులభంగా తెలిసిపోతుంది. ఆర్థిక సంవత్సరంలో ఎంత పన్ను మినహాయించారు, టీడీసీ సమాచార రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మీ పెట్టుబడులు తదితర సమాచారం నమోదు చేసి ఉంటుంది.

ఫారం 26ASతో ITR ఫైల్ చేయడం:
ఫారమ్ 16 లేని వ్యక్తులు వారి TDS, TCS గురించిన సమాచారాన్ని ఫారమ్ 26AS నుండి పొందవచ్చు. ఈ ఫారమ్ ముందస్తు పన్ను చెల్లింపులు, అధిక-విలువ లావాదేవీలు ఇతర సంబంధిత వివరాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఫారమ్ 16 లేకుండా ITR ఫైల్ చేయడానికి, వ్యక్తులు వారి జీతం స్లిప్, HRA స్లిప్, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 80C 80D కింద పెట్టుబడి రుజువు మొదలైనవి కలిగి ఉండాలి. దీంతోపాటు హోం లోన్ వంటి వాటికి సంబంధించిన రుజువును కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు ఫారం 16లేకుండా ఇన్ కమ్ ట్యాక్స్ సులభంగా ఫైల్ చేయవచ్చు.

ఫారమ్ 26AS డౌన్‌లోడ్ చేయడం ఎలా?

– మీ జీతం ఇన్ కం ట్యాక్స్ పరిధిలోకి రాకున్నా మీరు ITR ఫైల్ చేయాలనుకుంటే Income tax వెబ్‌సైట్ నుండి ఫారం 26ASని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– ఈ-ఫైల్ పోర్టల్ పై క్లిక్ చేయాలి.
-ఇప్పుడు మీకు My Account ఆప్షన్ కనిపిస్తుంది, View Form 26AS లింక్‌పై క్లిక్ చేయండి.
– దీని తర్వాత, దానిలో అసెస్‌మెంట్ ఇయర్‌ని సెలక్ట్ చేసుకుని, వ్యూ టైమ్‌పై క్లిక్ చేయండి.
-ఆ తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ ఫారమ్ డౌన్‌లోడ్ అవుతుంది.