Site icon HashtagU Telugu

8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

Cabinet approves constitution of 8th Pay Commission

Cabinet Cabinet approves constitution of 8th Pay Commission Constituti

8th Pay Commission: కేంద్ర క్యాబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్‌ నియామించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్నాయి. దీంతో ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి.

ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది. వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక, ఇస్రోలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రోదసిలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మూడ‌వ లాంచ్‌ప్యాడ్ ద్వారా నెక్ట్స్ జ‌న‌రేష‌న్ లాంచ్ వెహికిల్స్‌(ఎన్జీఎల్వీ)ను ప్ర‌యోగించ‌నున్నారు. ఎన్జీఎల్వీ రాకెట్లు భారీ శాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి మోసుకెళ్ల‌గ‌ల‌వని ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. రోద‌సి ప్ర‌యోగాల‌కు చెందిన మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో ఇదొక ముఖ్య‌మైన మైలురాయిగా మార‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మొద‌టి, రెండ‌వ లాంచ్‌ప్యాడ్ల‌తో పోలిస్తే .. మూడ‌వ లాంచ్‌ప్యాడ అధిక సామ‌ర్థ్యంతో ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. నాలుగేళ్ల‌లో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Read Also: Caller ID Feature : ప్రతీ ఫోనులో కాలర్ ఐడీ ఫీచర్.. ట్రయల్స్ చేస్తున్న టెల్కోలు