CAA Implements : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోడీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. తాజాగా అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry ) ఒక పోర్టల్‌ను ప్రారంభించింది (CAA website goes live) . భారత పౌరసత్వం ( Indian citizenship) కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు CAA-2019 పేరుతో మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పిండచం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వాన్ని కల్పించనున్నారు. అయితే, 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
.ముందుగా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
.‘సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం అప్లికేషన్ సబ్మిట్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
.ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేని కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేస్తే నెక్ట్స్ పేజ్ ఓపెన్ అవుతుంది.
.అక్కడ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇతర వివరాలను నమోదు చేసి సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
.వివరాలన్నీ నమోదు చేసి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే.. మీ ఈ మెయిల్, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
.ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
.వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ పేరుతో లాగిన్ అయి న్యూ ఫామ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
.అక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్, ఏ దేశానికి (పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్) చెందిన వారు, భారత్‌కు ఎప్పుడు వచ్చారు..? వంటి ప్రశ్నలకు సమాధానాలతో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది.
read also: T-SAFE: టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి