Site icon HashtagU Telugu

CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్‌.. ప్రధాని మోడీ ప్రసంగం

Pm Modi Speech In Arunachal

PM Modi Speech in Arunachal Pradesh

CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’కు సంబంధించిన గైడ్ లైన్స్‌తో కాసేపట్లో నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయబోతోంది. దీనిపై ఇంకాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రిలోగా సీఏఏ గైడ్ లైన్స్‌ను కేంద్ర హోం శాఖ నోటిఫై చేయనున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి

అమిత్ షా ఏమన్నారంటే.. 

‘‘ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి వస్తుంది. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతల వాగ్దానమే. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న అల్పసంఖ్యాకుల కోసం కాంగ్రెస్‌ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది. కానీ దానినుంచి వెనక్కి మళ్లింది. సీఏఏ పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారు. కానీ ఎవరి పౌరసత్వానికీ ఇబ్బంది ఉండదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో హింసకు గురై మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం మంజూరు చేయడానికి ఉద్దేశించిన చట్టం ఇది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వివరించారు.

Also Read :Indrakaran Reddy : కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..?