330 Crores Interest Payment : బైజూస్ 330 కోట్ల వడ్డీ చెల్లించే డెడ్ లైన్ ఈరోజే ?

ప్రఖ్యాత ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్(Byju's) లో ఏదో జరుగుతోంది ? ఆ కంపెనీలో ఓ వైపు భారీ ఉద్యోగ కోతలు జరుగుతున్నాయి.. మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులపై వందల కోట్ల రూపాయల వడ్డీలు(330 Crores Interest Payment) చెల్లించే డెడ్ లైన్స్ ముంచుకొస్తున్నాయి ! 

  • Written By:
  • Updated On - June 5, 2023 / 01:14 PM IST

ప్రఖ్యాత ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్(Byju’s) లో ఏదో జరుగుతోంది ?

ఆ కంపెనీలో ఓ వైపు భారీ ఉద్యోగ కోతలు జరుగుతున్నాయి.. 

మరోవైపు వేల కోట్ల రూపాయల అప్పులపై వందల కోట్ల రూపాయల వడ్డీలు(330 Crores Interest Payment) చెల్లించే డెడ్ లైన్స్ ముంచుకొస్తున్నాయి ! 

మిగితా స్టార్టప్స్ లాగే బైజూస్ కూడా  గతంలో వ్యాపార విస్తరణ కోసం అప్పులు చేసింది. వివిధ రకాల ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరించింది. ఈక్రమంలోనే  పలు ప్రముఖ ఆర్థిక సంస్థల నుంచి మొత్తంగా దాదాపు రూ.9,900 కోట్ల అప్పును  బైజూస్ చేసిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ రుణంపై ప్రతి 3 నెలలకు రూ.330 కోట్ల వడ్డీని  బైజూస్ కట్టాల్సి ఉందని(330 Crores Interest Payment) ఆ న్యూస్ రిపోర్ట్స్ లో ప్రస్తావించారు. ఈ భారీ వడ్డీ మొత్తాన్ని చెల్లించే డెడ్ లైన్ ఈరోజే (జూన్ 5) అని అందులో పేర్కొన్నారు. ఒకవేళ ఈరోజు దాని పేమెంట్ చేయకుంటే ఆ సంస్థల నుంచి తీసుకున్నఒక భారీ లోన్ డీఫాల్ట్ అవుతుందని తెలిపాయి. గత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక  ఫలితాలను కూడా బైజూస్ ఇంకా విడుదల చేయలేదు. ఈ రిజల్ట్స్ ను రిలీజ్ చేయాలని రుణాలు ఇచ్చిన సంస్థలు ఆ కంపెనీని కోరుతున్నాయి. అయితే అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో బైజూస్ కు రూ. 4,564.38 కోట్ల నష్టం వచ్చింది.

Also read : Byju’s Cuts Jobs: నష్టాల బాటలో బైజూస్.. ఉద్యోగులపై వేటు!

ఎవరీ బైజు రవీంద్రన్‌..

కేరళకు చెందిన ఒక‌ సాధారణ టీచ‌ర్ కొడుకు బైజు ర‌వీంద్ర‌న్.. బైజూస్ కంపెనీని స్థాపించాడు.  కేరళలోని అజికోడ్‌ గ్రామంలో జన్మించిన రవీంద్రన్‌ కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం CAT పరీక్షలో వరుసగా రెండుసార్లు 100 శాతం మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన రవీంద్రన్‌ కొన్ని రోజుల్లోనే అది వదిలేశారు. అనంతరం CAT పరీక్షకు సిద్ధమయ్యే వారికి కోచింగ్ ఇవ్వడానికి 2007లో కంపెనీని ప్రారంభించారు. ఆ విధంగా వ్యాపార ప్రస్థానం మొదలుపెట్టిన రవీంద్రన్‌ లైఫ్ 2011లో కీలక మలుపు తిరిగింది. 2011లో తన భార్య గోకుల్‌ నాథ్‌తో కలిసి థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీని పేరునే బైజూస్‌గా మార్చారు.