Site icon HashtagU Telugu

Business Ideas: ఎండాకాలం అయినా, చలికాలం అయినా ఈ సాగు చేస్తే ఏడాది పొడవునా ఆదాయమే..!

Business

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Business Ideas: డ్రై ఫ్రూట్స్ అంటే మనందరం ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాలు. ఎండాకాలం, శీతాకాలం వర్షాకాలంలో ఇలా సీజన్ తో సంబంధం లేకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ప్రయోజనకరం అని చెప్పవచ్చు. ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్‌ చాలా పెరిగింది. ఈ రోజు మేము మీకు డ్రై ఫ్రూట్స్ సాగు గురించి సమాచారాన్నిఅందిస్తున్నాం. జీడిపప్పు తీసుకోవడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

ఇటువంటి పరిస్థితిలో మీరు జీడిపప్పు వ్యాపారం (Business) నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నేటి కాలంలో ప్రభుత్వం కూడా వాణిజ్య పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మీరు కూడా తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనుకుంటే.. మీరు వెంటనే జీడిపప్పు సాగు ప్రారంభించవచ్చు. కాబట్టి జీడిపప్పు సాగుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు దాని నుండి వచ్చే లాభాల గురించి మీకు మేము తెలియజేస్తున్నాం.

Also Read: Rupee vs Dollar: ఒక్క డాలర్‌కు 82.46 రూపాయలు.. బలపడుతున్న దేశీ కరెన్సీ విలువ..!

జీడిపప్పు సాగును ఇలా ప్రారంభించండి..!

ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్న ప్రదేశంలో జీడిపప్పు సాగు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో పాటు ఇది ఎర్ర నెలలో చాలా వేగంగా పెరుగుతుంది. ఈ పంటను సాగు చేసే ముందు పొలాలను సరిగ్గా దున్నాలి. దీని తర్వాత జీడి మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఒక హెక్టారు భూమిలో దాదాపు 500 నుండి 600 మొక్కలు నాటవచ్చు. దీని తరువాత వర్షం, తేమ కారణంగా దీని పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఎర్రమట్టిలో దీని దిగుబడి ఎక్కువ అని చెప్పవచ్చు. కావున జీడిపప్పును ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఎక్కువగా పండిస్తారు. జీడి మొక్క మనకు 2 నుండి 3 సంవత్సరాలలో పెరిగి పంట మన చేతికి వస్తుంది. దీని తరువాత మీరు సులభంగా మార్కెట్ లో జీడిపప్పులను విక్రయించి మంచి లాభం పొందవచ్చు.

ఖర్చు, సంపాదన ఎంత..?

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు సుమారు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీని తరువాత మీకు ఒక హెక్టారు పొలంలో ప్రతి మొక్క నుండి దాదాపు 20 కిలోల వరకు జీడిపప్పు దిగుబడిని సాధించవచ్చు. మార్కెట్ లో కిలో జీడిపప్పును రూ.800 నుంచి రూ. 1000 వరకు అమ్ముకోవచ్చు. దీంతో మనం ఈ వ్యవసాయం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.