Business Ideas: మీరు మీ స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటున్నారా.. అయితే మేము మీ కోసం ఒక గొప్ప వ్యాపార ప్రణాళిక (Business Idea)ను తీసుకువచ్చాం. అదే కొబ్బరి నీళ్ల వ్యాపారం (Business). కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మార్కెట్లో కొబ్బరి నీళ్లకు డిమాండ్ చాలా పెరిగింది. ఈ కారణంగా పెద్ద మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, జింక్, సెలీనియం మొదలైనవి కొబ్బరి నీళ్లలో ఉంటాయి. కాబట్టి . ఇటువంటి పరిస్థితిలో కొబ్బరి నీళ్ల వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మార్కెట్‌లో కొబ్బరి నీళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. మీరు ఈ వ్యాపారం నుండి చాలా లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని రెండు విధాలుగా ప్రారంభించవచ్చు. ఒక విధంగా కొబ్బరి నీటిని మాత్రమే విక్రయించవచ్చు. మరో విధంగా మీరు మార్కెట్లో టెట్రా ప్యాక్‌లో కూడా సరఫరా చేయవచ్చు. మీరు చిన్నమొత్తంలో పెట్టుబడి పెట్టి కొబ్బరి నీళ్లను విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం వివరాలను మీకు తెలియజేస్తున్నాం.
Also Read: Remedies for Burns: మీ ఇంటి దగ్గర ఈ చిట్కాలు వాడితే కాలిన గాయాలకు చెక్ పెట్టొచ్చు..!
తక్కువ పెట్టుబడి
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు తక్కువ పెట్టుబడి అవసరం. మీరు ముడిసరుకు అంటే.. కొబ్బరిబొండాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది కాకుండా మీరు నీటిని తీసే యంత్రాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి దాదాపు రూ.లక్ష పెట్టుబడి అవసరం. దీని తర్వాత కొబ్బరి నీళ్లను ముట్టుకోకుండా యంత్రం సాయంతో బయటకు తీసి కప్పుల్లో పెట్టి కూడా అమ్ముకోవచ్చు.
ఎంత ఆదాయం వస్తుంది..?
మీరు ఒక కప్పు కొబ్బరిబొండాని రూ.50 నుండి రూ.60 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీరు ప్రతి నెలా కనీసం రూ.60 వేల నుండి రూ.70 వేల వరకు సంపాదించవచ్చు. దీనితో పాటు మీరు కొబ్బరి నీళ్ల స్టాల్‌ను శుభ్రంగా ఉంచడం, జాగ్రత్తగా చూసుకోవడం గుర్తుంచుకోవాలి.