Bus Fell Into Valley : లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి.. 26 మందికి గాయాలు

Bus Fell Into Valley : హర్యానా టూరిస్టుల బస్సు 100 మీటర్ల లోతైన  లోయలో పడిపోయింది.

  • Written By:
  • Updated On - October 9, 2023 / 07:40 AM IST

Bus Fell Into Valley : హర్యానా టూరిస్టుల బస్సు 100 మీటర్ల లోతైన  లోయలో పడిపోయింది. ఆదివారం రాత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్‌ జిల్లా కలాధుంగిలోని నల్ని ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు చనిపోగా, 26 మంది గాయపడ్డారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదం సంభవించిన టైంలో ఈ బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందినవారు. వీరంతా నైనితాల్ ను సందర్శించి హర్యానాలోని హిస్సార్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ప్రమాదానికి గల కారణాలు (Bus Fell Into Valley) ఇంకా తెలియరాలేదు.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితౌరాగఢ్​ జిల్లా కైలాష్ మానసరోవర్ రోడ్డులోని థాక్తి ప్రాంతంలో 8 మందితో వెళ్తున్న బొలేరో వాహనంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. కొండచరియలు విరిగిపడటం వల్ల వాహనం శిథిలాల కింద కూరుకుపోయింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు, ఆర్మీ దళాలు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారు. దీంతో కేదార్‌నాథ్​ జాతీయ రహదారిపై  కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

Also read : YSRCP : నేడు విజ‌య‌వాడ‌లో వైసీపీ ప్ర‌తినిధుల స‌భ‌.. న‌గ‌రంలో ట్రాఫిక్ మ‌ళ్లింపు