Site icon HashtagU Telugu

Bus Accident : కెనాల్‌లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి

Bus Accident in Punjab 8 People Passed away bus dip into canal

Bus Accident in Punjab 8 People Passed away bus dip into canal

సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు(Private Bus) ప్రమాదవశాత్తు కెనాల్(Canal) లో పడిపోయింది. ఈ ఘటన పంజాబ్(Punjab) లోని ముక్త్ సర్ జిల్లా సిర్హింద్ ఫీడర్ కెనాల్ వద్ద జరుగగా.. ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ముక్త్ సర్ నుంచి కొట్కాపురా వెళ్తున్న బస్సు.. రహదారిలోని ఝబెల్ వాలి గ్రామ సమీపంలో డ్రైవర్ సడెన్ గా బ్రేక్స్ వేయడంతో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోయిందని.. ఈ సంఘటన జరిగిన సమయంలో వర్షం కురవడం వల్ల కూడా బస్సు టైర్లు పట్టు కోల్పోయి ఉండవచ్చని చెబుతున్నారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. ముక్త్ సర్ డిప్యూటీ కమిషనర్ రూహీ డగ్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండగా.. కొందరు ప్రయాణికులు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండవచ్చన్నారు. క్రేన్ సహాయంతో బస్సును కాలువలో నుంచి బయటకు తీశామని, గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు సహాయకచర్యలు చేపట్టడంతో అధిక ప్రాణనష్టం జరగలేదన్నారు. సీఎం భగవంత్ మాన్.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

 

Also Read : Road Accident: బొల్తా కొట్టిన బస్సు, ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం