బుల్లెట్ రైలు వ‌చ్చేస్తుదండీ.. మూడు గంట‌ల్లో ముంబైకి!

మీరు హైదార‌బాద్ నుంచి ముంబైకు త‌రుచుగా రైలులో వెళ్తున్నారా.. అయితే దానికి ప‌ట్టే స‌మ‌య ఎంతో తెలుసా.. క‌నీసం 15 గంట‌లు ప‌డుతుంది. అన్ని గంట‌లు ట్రైన్ లో జ‌ర్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాల్సిందే మ‌రి.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:28 PM IST

మీరు హైదార‌బాద్ నుంచి ముంబైకు త‌రుచుగా రైలులో వెళ్తున్నారా.. అయితే దానికి ప‌ట్టే స‌మ‌య ఎంతో తెలుసా.. క‌నీసం 15 గంట‌లు ప‌డుతుంది. అన్ని గంట‌లు ట్రైన్ లో జ‌ర్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాల్సిందే మ‌రి. మీలాంటివాళ్ల కోసం ఓ స్పెష‌ల్ ట్రైన్ వ‌చ్చేస్తుంద‌డీ.. దాని పేరే బుల్లెట్ రైలు. ఇది క‌నుక హైద‌రాబాద్ లో అందుబాటులోకి వ‌స్తే కేవ‌లం మూడు గంట‌ల్లోనే ముంబై కు చేరుకోవ‌చ్చు. భాగ్య‌న‌గ‌ర వాసుల క‌ల‌ల‌ను నిజం చేసేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ మేర‌కు ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న‌పై కేంద్రం స‌ర్వే చేస్తోంది.

హైద‌రాబాద్ నుంచి ముంబైకి వెళ్లాలంటే దాదాపుగా 10 నుంచి 12 స్టేష‌న్లు ఉంటాయి. ఈ రెండు సిటీస్ మ‌ధ్య దూరం సుమారు. 600 కిలోమీట‌ర్లు. సాధారణ రైలు ప్ర‌యాణిస్తే క‌నీసం 15 గంట‌లు ప‌డుతుంది. అదే బుల్లెట్ రైలులో మాత్రం మూడు గంట‌లో చేరుకోవ‌చ్చు. భూసేక‌ర‌ణ‌పై కేంద్రం ఫోక‌స్ చేయ‌గా.. మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం దానికి సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రిస్తోంది.

ఇక ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ బుల్లెట్‌ రైలు వేగాన్ని తట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 8 బుల్లెట్‌ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉంది. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వ‌స్తే ఉద్యోగ అవ‌కాశాలు పెరుగుతాయి. క‌నీసం ప‌దివేల‌ నిర్మాణ రంగ ఉద్యోగాలు, ఇంకా 4వేల ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు, నిర్వ‌హ‌ణ కోసం 20వేల ప‌రోక్ష ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.