2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. ఈసారి తమ కోర్కెలు తీరేలా బడ్జెట్ ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లారు మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman). రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఎంతసేపు మోడీ ఫై ప్రశంసలు తప్ప..రైతుల కష్టాలు తీర్చేలా మాత్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు.
ముఖ్యంగా పీఎం కిసాన్ (PM Kisan) పెంపుకు సంబదించిన నిర్మలా తీపి కబురు తెలుపుతుందని బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటి నుండి రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ మంత్రి మాత్రం ఆ ఊసే లేకుండా బడ్జెట్ కాపీని చదివేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈసారి రైతులకు గుడ్‌న్యూస్ ఉంటుందని అన్నదాతలు ఆశించారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని రైతులు భావించారు. అయితే అలాంటివేమీ లేకుండా మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ప్రభుత్వం కృషి చేసిందని మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార ధాన్యాల ఆందోళనలను తొలగించే పని మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు.
‘ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. అన్ని వర్గాలు, ప్రజలందరి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.’ అని పేర్కొన్నారు.
ప్రపంచమంతా ఆర్థిక పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ G20 సదస్సుని విజయవంతంగా పూర్తి చేయగలిగామని వెల్లడించారు. అంతే తప్ప ఎక్కడ కూడా రైతుల గురించి కానీ సామాన్య ప్రజల అవసరాలు తీర్చే అంశాలను మాత్రం ప్రస్తావించలేదు. చివర్లో మాత్రం ‘ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. జులైలో పూర్తిస్థాయి బడ్జెట్తో వికసిత్ భారత్ సాధన కోసం మా ప్రభుత్వ వివరణాత్మక రోడ్ మ్యాప్ ను ప్రకటిస్తాం’ అని తెలిపారు.