దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్ 2025 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి రూ. 50.65 లక్షల కోట్లు వ్యయంతో బడ్జెట్ రూపొందించబడింది. ఆదాయం పన్ను మినహాయింపులు, వ్యవసాయ, ఆరోగ్య రంగాల ప్రోత్సాహం, పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం పొందాయి.
1. ఆదాయం పన్ను & ఇతర ప్రోత్సాహకాలు:
రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చారు.
స్టాక్ మార్కెట్ లావాదేవీలపై పన్ను సవరించడంతో పెట్టుబడిదారులకు ఊరట లభించింది.
నూతన ఉద్యోగులకు రూ.15,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ప్రకటించారు
Virat Kohli Fan: విరాట్ కోహ్లీ అభిమానిపై పోలీసులు పిడిగుద్దులు.. ఏం చేశాడో చూడండి!
2. వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి :
PM-Kisan పథకం కింద రైతులకు ఆర్థిక సహాయాన్ని రూ. 6,000 నుండి రూ. 12,000కి పెంచారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ. 11 లక్షల కోట్లు కేటాయించారు
3. ఆరోగ్య & విద్యా రంగాల్లో మార్పులు :
క్యాన్సర్ సహా 36 రకాల మందులపై కస్టమ్స్ డ్యూటీ తొలగించారు.
విద్యారంగంలో కొత్త చట్టాలు అమలు చేయడంతోపాటు, విద్య కోసం పన్ను తగ్గింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి
4. పరిశ్రమ & పెట్టుబడులు :
బీమా రంగంలో 100% FDIకు అనుమతి ఇచ్చారు.
విదేశీ బ్యాంకులపై పన్ను తగ్గింపు ఉండే అవకాశం ఉంది
5. మహిళలు & ఉపాధి :
మహిళల ఉపాధిని ప్రోత్సహించడానికి కొత్త హాస్టళ్లు నిర్మించనున్నారు.
ఉద్యోగాల్లోకి కొత్తగా ప్రవేశించే వారికి EPFO కంట్రిబ్యూషన్ రీయింబర్స్‌మెంట్ పొందే అవకాశం
ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపకరిస్తాయి. పన్ను తగ్గింపులు, వ్యవసాయ, పరిశ్రమ, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా మధ్య తరగతి, రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.