Site icon HashtagU Telugu

Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?

Budget 2024

Budget 2024

Budget 2024: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్న మధ్యంతర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా ?లేక ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుందా..అనే చర్చ దేశమంతటా వినిపిస్తోంది. ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం కరుణ చూపిస్తుందని గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై చర్చ జరుగుతోంది..

బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రానున్నది ఎన్నికల సీజన్ గనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాయిలాలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని విశ్లే షకుల అంచానా వేస్తున్నారు..

దేశం వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నవేళ పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక శక్తి సన్నగిల్లుతోంది. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని నిర్మళా సీతారామన్ బడ్జెట్ ఉండబోతుందని, ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్లో తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మధ్యతరగతి ప్రజలపై తీవ్రభారం పడుతోంది. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించొచ్చని తెలుస్తుంది. పెట్రోల్ ధరలను తగ్గిస్తే సామాన్య ప్రజలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. లీటర్ పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉంటుంది.. అలాగే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్లో సామాన్యులకు లబ్ది చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరీ నిర్మలాసీతారామన్ లెక్కలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.

Also Read: Skin Care: తరచూ స్కిన్ కేర్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?