2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సామాన్యుడు బ్రతికే రోజులు పోయాయి. వచ్చే జీతానికి..ప్రస్తుతం ఉన్న ధరలకు పొంతన లేకుండా పోయింది. జీతం పావులా అయితే ఖర్చు రూపాయి లా మారింది..కుటుంబ పోషణ కోసం సామాన్యుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఏది కొందామన్నా భారీ ధరలు ఉండడం తో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో 2024 బడ్జెట్ లోనైనా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman ) తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని సామాన్య పౌరులు ఆశాభావంతో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాకపోతే 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా బిజెపి సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరిలో జరిగే మధ్యంతర బడ్జెట్ లో భారీ ప్రకటనలు వస్తాయన్న అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తోసిపుచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ అవుతుందని, అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చని చెప్పారు. పెద్ద గృహ రుణాల అవసరాన్ని బట్టి, వచ్చే బడ్జెట్లో గృహ రుణాల చెల్లింపునకు ఆర్థిక మంత్రి ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలి. మొదటిసారి గృహ కొనుగోలుదారులకు గృహ రుణాలపై వడ్డీ కోసం.. 2019 లో ప్రవేశపెట్టిన సెక్షన్ 80ఈఈఏ నుంచి సాయం తీసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. నివాస గృహం కోసం తీసుకున్న గృహ రుణానికి చెందిన అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ .1.5 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్‌కు కంట్రిబ్యూషన్లు, ఈఎల్ఎస్ఎస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లు, ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ ఎఫ్డిలు మొదలైన ఇతర అర్హత కలిగిన ఖర్చులతో పాటు ఈ మినహాయింపు లభిస్తుంది. ఇంకా ఏమేమి లభిస్తాయి అనేది చూడాలి.