Buddhism: భారత్ ను మార్చేసిన బుద్ధిజం

బుద్ధిజం వ్యాప్తి వల్లే భారత్ లో అహింసా వాదాన్ని అనుసరించి యుద్ధాలు చెయ్యడం మాని వేసారని చెబుతారు కొందరు చరిత్ర కారులు. ఈ అహింస సిద్ధాంతం వల్ల దేశరక్షణ కరవై ముస్లింల దాడిలో పరాక్రమాలను ప్రదర్శించ లేక పోయారట . చేతికి పని లేకపోవడం వల్ల రాజులు భోగలాలసులై ప్రజలకు, దేశాన్ని పట్టించుకోవడం మానివేసారని , దానితో ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన భారత భూభాగాన్ని క్రమక్రమంగా కోల్పోవల్సి వచ్చిందని చెబుతారు.

  • Written By:
  • Updated On - January 14, 2023 / 05:32 PM IST

బుద్ధిజం వ్యాప్తి వల్లే భారత్ లో అహింసా వాదాన్ని అనుసరించి యుద్ధాలు చెయ్యడం మాని వేసారని చెబుతారు కొందరు చరిత్ర కారులు. ఈ అహింస సిద్ధాంతం వల్ల దేశరక్షణ కరవై ముస్లింల దాడిలో పరాక్రమాలను ప్రదర్శించ లేక పోయారట . చేతికి పని లేకపోవడం వల్ల రాజులు భోగలాలసులై ప్రజలకు, దేశాన్ని పట్టించుకోవడం మానివేసారని , దానితో ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన భారత భూభాగాన్ని క్రమక్రమంగా కోల్పోవల్సి వచ్చిందని చెబుతారు. చివరకు భారత్ భూభాగం కూడా ముస్లింలకు అప్పగించవల్సి వచ్చింది. ఇదే అదనుగా ముస్లింలు అనేక ఆలయాలను ద్వంశం చేస్తున్నా , సంపదను దోచుకుంటున్నా , చివరకు మహిళల మాన ప్రాణాలను దోస్తున్నా , యువకుల్ని వధిస్తున్నా , లక్షల సంఖ్యల్లో ముస్లిం మతంలోకి మార్చి వేస్తున్నా అహింస పరమో ధర్మహ : అన్నారు. ఎవరన్నా తిరగ బడదామని అనుకున్నా ఎవరివద్దా ఆయుధాలు లేవు. ఎక్కడికక్కడ యువకుల తలలు నరికి వేసారు. పెళ్ళికాని యువతుల్ని ఎత్తుకు పోయారు. గృహిణుల మానాన్ని హరించారు. దీనికంతటికీ కారణం అహింస సూత్రం తలకెక్క డమే నట. హింసకు పాల్పడవద్దు అన్నారు గానీ , హింసను సహించ మన్నారా ? ఒక చెంప కొడితే రెండో చెంప చూపమన్నారు కానీ , మాన ప్రాణాలను హరిస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారా ?

ఇక ముస్లింల అరాచకం వర్ధిల్లి , వారి పాలన సాగే సమ యంలో తరువాత వ్యాపారం పేరుతో ఆంగ్లేయులు వచ్చారు. జహంగీర్ బాద్షా తన జన్మదినం రోజు ధనరాశులతో తులాభారం తూగుతుంటే , ఆ తులాబారాన్ని చూసి నోరు వెళ్ళ బెట్టిన సర్ ధామస్ రో అనే బ్రిటీష్ ప్రతినిధి , ఇంత సంపద భారత్ లో ఉందా , తులాబారం తూగి ఉచితంగా పంచి పెడుతుండమా అని ఓపికతో 3 సం.లు నానా అవమానాలు పొంది ఒక చిన్న దుకాణం పెట్టుకోవడానికి అనుమతి సంపదించాడు . అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ నిదానంగా హిందువు లకు, ముస్లింలకు గొడవలు పెట్టి చివరకు భారత్ నే కైవసం చేసుకుంది. మొదట వ్యాపార అనుమతి తీసుకుని వ్యాపారం మొదలు పెట్టి ఉద్యోగుల భక్తి పేర దైవారాధన పేరిట ఒక చిన్న చర్చ్ ను నిర్మించుకుని ప్రార్ధన చేసుకుంటామని అనుమతి తీసుకుని, చర్చ్ నిర్మించి , దైవారాధన చేస్తున్నట్లు నటిస్తూ , రాజుల మద్య వైరాన్ని ఆసరాగా తీసుకుని కొందరికి సైనిక సాయం అందిస్తూ , కొందరికి ఆర్ధిక సాయం చేస్తూ , అప్పుల కింద పన్నులు వసూలు చేసుకునే హక్కులు పొందుతూ , నిదానంగా ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమిస్తూ , చర్చిలను నిర్మించుకుంటూ భారత్ అంతా వందల చర్చ్ లు నిర్మించారు.

చర్చ్ లో వారూ అదే చెప్పారు. దయగల ప్రేమ ప్రభువు ఏసు అని చెప్పి భారత దేశాన్ని ఆక్రమించి ముస్లింలు దోచుకు వెళ్ళాక మిగిలినది ఈ బ్రిటీష్ వారు దోచుకుపోయి కొన్ని లక్షల మందిని ప్రేమ , దయ , సేవ పేరుతో మత మార్పిడులు చేసారని చరిత్ర పరిశోధకులు చెబుతారు . ఇంకా నేటికీ అదే వరవడిన నల్ల దొరల పేరుతో అమలు చేస్తూనే ఉన్నారని , ఒక్కో రాష్ట్రాన్ని మతపరంగా మార్చి వేయాలని , కొందరు రాజకీయంగా , నాయకుల అవతారం ఎత్తి మత మార్పిడులు చేయిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది అప్పటి ఆంగ్లేయుల తేనె పూసిన కత్తి లాంటి మత , వ్యాపార సూత్రం .

ఇక స్వాతంత్యా నంతరం మన నల్ల దొరలు చేస్తున్నవి కూడా పరిశీలన చెయ్యాలి . ముందుగా గాంధీ గురించి చెప్పుకోవాలి . ఈయన మార్గం అహింస. వేల మందిని ఊచ కోత కోస్తున్నా సహించ మన్నాడు. అలా చేస్తే ఏదో ఒక రోజు వారిలో మార్పు వస్తుందని ఆశపడ్డాడు పాపం . కొన్ని వందల సం. లు భారత్ ను పాలించిన అనుభవం ముస్లింలకు ఉంటే , మన బలహీనతలు అన్నీ తెల్సి ఉన్న వారు ముస్లింలు అయితే వారిలో మార్పు ఎలా వస్తుం దని , అలా ఎందుకు అన్నారో కూడా తెలియదని , భారత స్వాతంత్యం 1947 న కాకుండా 47 కు ముందే వచ్చి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదని , గాంధీలో ఉన్న అహింసా మూర్తిని చూసిన బ్రిటీష్ ప్రభుత్వం గాంధీని బాగా ప్రమోట్ చేసి ఆకాశానికి ఎత్తిందని , దాన్నొక సాధనంగా వాడుకుని మత కలహాలను సృష్టించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకో పక్క ముస్లింలను గిల్లిం దని , వారు శక్తి కూడ గట్టుకునే వరకూ వేచి ఉండి, అల్లర్లు , లూఠీలు , దహనాలు, ఊచకోతలు జరిగే వరకూ వేచి ఉండి అప్పుడు భారత్ కు స్వాతంత్ర్యం బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిందని , అదే గాంధీ సిద్ధాంతాన్ని ముస్లింలు పక్కన పడేసారని , చివరకు ఏమీ చెయ్యలేక తన సిద్ధాంతన్నే పట్టుకు గాంధీ వేళాడడంతో దేశ విభజనకు కారకుడైనాడని విశ్లేషకులు చెబుతున్నారు.

బ్రిటీష్ వారు నెహ్రూని లైన్లో పెట్టుకుని తమ పని పూర్తి చేసారని , స్వాతంత్ర్య అనంతరం నెహ్రూ ప్రధానిగా దేశాన్ని పాలిస్తూ గాంధీ జపం చేస్తూ , పిల్లలకు గాంధీ పేర్లు పెట్టుకుంటూ రాజ కీయంలో సుస్థిర స్థితికి చేరు కుని , వారసత్వ రాజకీయాన్ని భారత్ కు అందించి , సరిహద్దు సమస్యలు, కుల, మత , వర్గ సమస్యలను అలాగే ఉంచి, జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసి వెళ్ళి పోయా డని రాజకీయ పరిశోధకులు చెబుతున్నారు . వారసత్వంగా వచ్చిన ఇందిర తన అధికారం నిలబెట్టుకోవడం కోసం అన్నీ జాతీయం చేసి , దేశాన్ని , నాయకుల్ని దారిలో పెడదామని ప్రయత్నించినా సన్ స్టోకులతో ప్రతిష్ఠ దెబ్బ తిందని , ముస్లిం , క్రిష్టియన్ సంస్థలను అదుపు చెయ్యలేక పోయిందని , తండ్రి లౌకికతత్వం అనే చట్రంలో భారత్ ను బిగించి వెళ్ళడం , దాన్ని మీరకూడదు అని పరమత సహనాన్ని పాటించి , విశ్వాసంగా భారత్ కు సేవ చేసిన వర్గాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి చివరికి వారి చేతుల్లోనే చనిపోయింది. రాజీవ్ కాలంలో , మన్ మోహన్ కాలంలో సోనియా వెనక ఉండి చక్రం తిప్పింది. క్రిస్టియన్ నాయకుల్ని రాజకీయంగా పెంచి పోషించింది. ఆ నాయకుల వలన లక్షల్లో క్రిస్టియన్లుగా నేటి భారత జనాభా మారు తున్నదని చెబుతున్నారు. ముస్లిం మత మార్పిడులు ఆగిపోయాయని , వలసల తోటి , కుటుంబ నియంత్రణ పాటించక పుట్టే జనాభాగా ముస్లింలు పెరగ వలసిందే గానీ కొత్తగా ఎవరూ ముస్లిం మతం లోకి మారడం లేదని కూడా చెబుతున్నారు.

ఇక కొత్తగా వచ్చిన బిజెపి ప్రభుత్వం హిందూ కార్డ్ ని వాడుకుంటూ గుజరాతీ వ్యాపారం చేస్తోంది. ఎక్కడ చూడు గుజరాత్ వారికి దోచి పెట్టడమే. కొత్తలో హిందువు లకి కొంతమందికి కొత్త ప్రభుత్వం బాగానే ఉన్నదని అనిపించింది. నిదానంగా దాని అసలు రూపు బైటకి వస్తోందని , రైతు వ్యతిరేక నిర్ణయాలు, లాభదాయక ప్రభుత్వ సంస్థలను కారు చవకగా అనుయాయులకు దోచిపెట్టడం, వేల కోట్ల విమానాలు, యుద్ధ పరికరాల కుంభకోణాలు , కరోనా వాక్సిన్ తో కూడా వ్యాపారం చెయ్యడం ఇలా ఒక్కొక్కటిగా బైటపడు తున్నాయని , కరోనా ముసుగులో చాలా అనుమతులు , పంపకాలు నడిచి పోయాయని , లోపాలు కప్పబడి పోయాయని చెబుతున్నారు. గుజరాత్ గాంధీ గారి మార్గాన్ని గుజరాత్ బాబు తన గుజరాత్ వ్యాపారుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని , పైకి హిందువు లకు రక్షణ ప్రతినిధిని అని చెప్పుకుంటూ తన రాజకీయ అవసరాల కోసం ఇతర మత నాయకుల్ని పెంచి పోషించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు . ప్రజల దానాలతో నిర్మించుకున్న హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పెత్తనం ఉండ వచ్చునా ? ఉంటే ఎంత వరకూ ఉండాలి ? ప్రభుత్వాలు పార్టీ వారిని ఆలయ బోర్డులలో నియమించడం ఎంత వరకూ సబబు ? ఇతర మత సంస్థ లను ఎందుకు లెక్కలు అడగడం లేదని , వందల కోట్లు దిగుమతి చేసుకుని మత మార్పిడులు చేస్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్ని స్తున్నారు . మత స్వేచ్చ అంటే ప్రజల కష్టార్జితాన్ని ప్రభుత్వం పన్నుల రూపేణా వసూలుచేసిన ధనాన్ని మతసంస్థలకు ఖర్చు చెయ్యవచ్చా ? ఇదేనా అజమాయిషీ అంటే ? ఏ హిందూ దేవాలయానికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ప్రజల డబ్బు , వారి కష్టార్జితంతో తర తరాలుగా వాటిని నిర్మించు కుంటూ వచ్చారు . ఇందులో ప్రభుత్వ అధికారం , పెత్తనం ఏందుకుండాలి అని ప్రశ్నిస్తున్నారు ? కేంద్రం ఒక చట్టం ఎందుకు చెయ్యదు ? మరి హిందుత్వంకు వీరు చేసే సేవ ఏమిటి ? దీనికంతటికీ స్వాతంత్ర్యం ఇచ్చేడప్పుడే బ్రిటీష్ వారు గాంధీ, నెహ్రూలతో నడిపిన రాయబారమే అన్నిటికీ మూలమని చెబుతున్నారు .