Site icon HashtagU Telugu

BSNL Tariffs : బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త లోగో.. 7 కొత్త సర్వీసులు.. టారిఫ్ ప్లాన్లపై గుడ్ న్యూస్

BSNL Direct to Device Satellite Connectivity

BSNL Tariffs : భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొంగొత్తగా ముందుకు సాగుతోంది. త్వరలో 5జీ సేవలు కూడా బీఎస్ఎన్ఎల్ అందించనుంది. ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లోగోను మార్చారు. కొత్త లోగోలో కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచారు. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను డిస్‌ప్లే చేశారు. ఇంతకుముందు లోగోలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ చిహ్నాలు ఉండేవి. కొత్త లోగోలోకి కాషాయ రంగు చేరడం గమనార్హం.

Also Read :Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు

కంపెనీ లోగోను మార్చిన సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ రాబర్ట్‌ రవి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ  పలు కీలక వివరాలను వెల్లడించారు. రాబోయే కొన్ని నెలలపాటు బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ టారిఫ్‌ ప్లాన్లను(BSNL Tariffs) పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. వినియోగదారుల సంతోషం కోసం రీఛార్జ్ టారిఫ్‌ ప్లాన్లను పెంచకూడదని నిర్ణయించామన్నారు.  రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేట్‌ ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ ప్లాన్లను పెంచాయి. బీఎస్ఎన్ఎల్ మాత్రం వాటి పెంపు ప్రసక్తే లేదని వెల్లడించడం.. ఆ కంపెనీ యూజర్లకు పెద్ద శుభవార్తే.

Also Read :China Vs India : భారత్‌తో కలిసి పనిచేస్తామన్న చైనా.. ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన

బీఎస్ఎన్ఎల్ 7 కొత్త సర్వీసులు