BSF Jawan Returned : బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ పూర్ణమ్ సాహూ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. ఏప్రిల్ 23న అతడిని అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ రేంజర్లు.. ఈరోజు(బుధవారం) ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించారు.
Also Read :India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ
పూర్ణమ్ సాహూ.. పాక్ బార్డర్‌లోకి ఎలా వెళ్లారంటే.. ?
పూర్ణమ్ సాహూ.. బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్‌లో సేవలు అందిస్తున్నాడు. ఆయన ఏప్రిల్ 23న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వర్తించాడు. విధులు నిర్వర్తించే క్రమంలోనే .. అక్కడున్న భారత్ – పాక్ సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు(BSF Jawan Returned) గస్తీ కాశారు. ఈక్రమంలో కొంత అస్వస్థతకు గురైన పూర్ణమ్ సాహూ సమీపంలోని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అయితే అది పాక్ భూభాగం అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ రేంజర్లు పూర్ణమ్ సాహూను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన విడుదల కోసం ఇరుదేశాల భద్రతా బలగాల మధ్య చర్చలు జరిగాయి.
Also Read :Who Is Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్.. ఎవరు ?
కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్న పూర్ణమ్ భార్య
పూర్ణమ్ సాహూ పాకిస్తాన్ ఆర్మీ అదుపులో ఉన్నారని తెలిసి, ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న పూర్ణమ్ భార్య.. తన భర్తను రిలీజ్ చేయించాంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. ఏప్రిల్ 23 నుంచి మే 13 వరకు పాకిస్తాన్ ఆర్మీ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసింది. సరిగ్గా ఇదే సమయంలో భారత్ – పాక్ సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపు దాల్చడంతో పూర్ణమ్ విడుదలలో మరింత జాప్యం జరిగింది. సైనిక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ పూర్ణమ్ సాహూను విడుదల చేయలేదు. ఈనేపథ్యంలో మే నెల మొదటివారంలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో భారత దళాలు ఒక పాక్ రేంజర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. దీంతో పాకిస్తాన్ రేంజర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణమ్‌ను భారత దళాలకు అప్పగించారు.