Site icon HashtagU Telugu

Pakistani Drone: పాక్ డ్రోన్‌ కూల్చివేసిన బీఎస్ఎఫ్ సిబ్బంది.. డ్రగ్స్ స్వాధీనం

Pakistani Drone

Resizeimagesize (1280 X 720) (1) 11zon

పాకిస్థాన్ (Pakistan) మరో ఎత్తుగడకు సరిహద్దు భద్రతా దళం (BSF) ధీటుగా సమాధానం ఇచ్చింది. అమృత్‌సర్‌లో చొరబడిన పాకిస్థాన్ డ్రోన్‌ (Pakistani Drone)ను గురువారం తెల్లవారుజామున బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది. పాకిస్థాన్ వైపు నుంచి ప్రవేశించిన డ్రోన్‌పై అమృత్‌సర్ బీఎస్‌ఎఫ్ సెక్టార్‌లోని ధనో కలాన్, బీఓపీ పాల్మోరన్ గ్రామం వద్ద కాల్పులు జరిపినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. డ్రోన్‌తో పాటు 2 కిలోల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ వైపు నుంచి చొరబడిన డ్రోన్‌ను భారత భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పులు జరిపి ధ్వంసం చేసింది. అమృత్‌సర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ప్రవేశించిన డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంతకుముందు మార్చి 28న అమృత్‌సర్‌లో మాదక ద్రవ్యాల సరుకుతో భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు BSF.. పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేసిందని పారామిలటరీ దళం తెలిపింది. అమృత్‌సర్‌లో బిఎస్‌ఎఫ్ సిబ్బందికి ఎగిరే వస్తువు శబ్దం వినిపించడంతో డ్రోన్‌ను కూల్చివేశారు. మరుసటి రోజు ఉదయం BSF జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఇది బయటపడింది.

Also Read: India-Saudi: మోదీ పిలుపుతో యుద్ధం ఆపేసిన సల్మాన్ రాజు..

అంతకుముందు, ఫిబ్రవరి 2-3 మధ్య రాత్రి 2:30 గంటలకు అమృత్‌సర్ సెక్టార్‌లోకి చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను ఇండో-పాక్ సరిహద్దు వెంబడి BSF సిబ్బంది కూల్చివేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లోని బోర్డర్ అబ్జర్వేషన్ పోస్ట్ (బీఓపీ) వెనుక కక్కర్ బాధ్యతల ప్రాంతంలోకి డ్రోన్ ప్రవేశించిందని BSF తెలిపింది. ఉదయం సరిహద్దు ఫెన్సింగ్, జీరో లైన్ మధ్య డ్రోన్‌తో పాటు నిషేధిత ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు BSF అధికారులు తెలిపారు.