Site icon HashtagU Telugu

Manipur : మహిళపై బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు

BSF jawan On Camera Gropes Woman

BSF jawan On Camera Gropes Woman

మణిపూర్ (Manipur) లోని ఓ స్టోర్ లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ (BSF Jawan)..మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారుతుంది. గత రెండు నెలలుగా మణిపూర్ లో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఈ దారుణ ఘటనలకు సంబంధించి యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రెండు జాతుల మధ్య వైరంతో అక్కడి మహిళలను హింసిస్తున్నారు. నడిరోడ్డు ఫై వారిని బట్టలు లేకుండా ఊరేగిస్తూ , అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటివి జరగకుండా..ఆడవారిని కాపాడాల్సిన జవాన్లు కూడా లైంగిక దాడులకు పాల్పడటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇంఫాల్ లో ఈ నెల 20న ఓ స్టోర్ లో మహిళపై బీఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ సతీశ్ ప్రసాద్ గా గుర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో ఆయన యూనిఫామ్ లోనే ఉన్నాడు. అంతేకాదు, ఆయన వద్ద ఇన్సాస్ రైఫిల్ కూడా ఉంది. ఈ ఘటన వెలుగులోకీ రావడం తో అధికారులు సతీశ్ (Satish Prasad) ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేశారు.

మణిపూర్ (Manipur) లో ఈ దారుణ ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ (CM Biren Singh) రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. బీరెన్ ను బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీరెన్ తేల్చి చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు. కానీ, కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే నేను పదవిని వదిలేస్తాను’ అని స్పష్టం చేశారు.

Read Also: Flight Journey For Food : కిరాణా సామాన్ల కోసం విమానంలో వెళ్తుంటుంది.. ఆమె ఎవరు ?