Delhi Liquor Case : ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదు.. పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు- కవిత

అతి త్వరలో తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని .. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 12:25 PM IST

ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసు అని అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఈడీ(ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) కొద్దీ సేపటి క్రితం హాజరుపరిచారు. కోర్ట్ కు వెళ్తున్న క్రమంలో మీడియా తో కవిత కీలక వ్యాఖ్యలు చేసారు.

అతి త్వరలో తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని .. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని తెలిపారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శించారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్‌గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడని కవిత చెప్పుకొచ్చారు. తమ అత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదని, అప్రూవర్‌గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్‌గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కోర్టు ఈడీ కస్టడీని పొడగిస్తుందా? లేక జ్యూడీషియల్ కస్టడీ విధిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితను 10 రోజులపాటు ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ కేసుకు సబందించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Read Also : Trump: ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌నకు స్థానం