Dosa Diplomacy : బ్రిటిష్ డిప్యూటీ హై క‌మిష‌న‌ర్‌ మ‌సాలా దోసె అస్త్రం

రాయ‌బార కార్యాలయాల్లోని అధికారులు అంటే త‌మ సొంత దేశం, తాము ప‌నిచేస్తున్న దేశాల మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ పెరిగేలా చూడాలి.

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 11:00 AM IST

రాయ‌బార కార్యాలయాల్లోని అధికారులు అంటే త‌మ సొంత దేశం, తాము ప‌నిచేస్తున్న దేశాల మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ పెరిగేలా చూడాలి. ఇందుకు ప్ర‌భుత్వాల విధానాల‌తో పాటు, వారి ప‌ర్స‌న‌ల్ బిహేవియ‌ర్ కూడా కారణాలుగా ఉంటాయి.తాము ప‌నిచేస్తున్న దేశాల ప‌ట్ల ప‌ర్స‌న‌ల్‌గా ఇంట్రెస్ట్ చూపితే ఆ రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు కూడా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. క్రిటిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి సంబంధాలే అక్క‌ర‌కు వ‌స్తాయి. అలాంటి వారే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు.

క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల వ్య‌వ‌హారాలు చూడ‌డానికి బ్రిటిష్ డిప్యూటీ హై క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన అన్నా షాట్‌బోల్ట్ ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. బ్రిట‌న్‌, ఇండియాల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ బాగుండాలంటే ముందుగా తాను ఇక్క‌డి వారితో క‌లిసిపోవాల‌ని అనుకున్నారు.బెంగుళూరులో ఛార్జి తీసుకోవ‌డానికి రావ‌డానికి ముందు మొద‌ట‌గా ఏమి చేశారో తెలుసా! హోట‌ల్‌కు వెళ్లి మ‌సాలా దోసెను టేస్ట్ చేశారు.తొలుత లండ‌న్‌లో కొత్త‌గా ఓపెన్ చేసిన ఎంటీఆర్ 1924 హోట‌ల్‌కు వెళ్లి క‌ర‌క‌ర‌లాడే క్రిస్పీ మ‌సాలా దోసెను తిని ఆస్వాదించారు. ఓ క‌ప్పు క‌మ్మ‌ని కాఫీ తాగారు.భార‌తీయుల మాదిరిగానే చేత్తో తిన‌డం ఇంకో విశేషం. ఇందుకు కార‌ణం కూడా ఉంది. గ‌త ఏడాది ఇండియాలో హై క‌మిష‌న‌ర్‌గా నియ‌మితులైన అలెక్స్ ఎల్లిస్ కూడా మ‌సాలా దోసెను తిన్నారు. అయితే నైఫ్‌, ఫోర్కుతో తిని, ఆ ఫొటోను ట్వీట్ చేశారు.

 

ఫోర్క్‌తో కాదు, చేత్తో తింటే ఆ టేస్టే వేర‌బ్బా అంటూ నెటిజ‌న్లు సూచ‌న‌లు ఇచ్చారు. అప్ప‌ట్లో బెంగ‌ళూరులో డిప్యూటీ హైక‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన పిల్‌మోర్ బెడ్‌ఫోర్డ్ కూడా ఇదే స‌ల‌హా ఇచ్చారు. ఇవ‌న్నీ గ‌మించిన అన్నా చేత్తోనే మ‌సాలా దోసె తిన్నారు.మొత్తానికి బ్రిటన్ అధికారులు దోసె డిప్ల‌మ‌సీతో బ‌హు ప‌సందుగా ముందుకు వెళ్తున్నారు.