Site icon HashtagU Telugu

BrahMos: బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం.. భారత రక్షణ రంగంలో మరో మైలురాయి?

Brahmos

Brahmos

BrahMos: రక్షణ రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బుధవారం విజయంతంగా పరీక్షించింది. సుభోజ్ 30 ఎంకేఐ యుద్ద విమానం నుంచి బ్రహ్మోస్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్ మిసైల్‌ను భారత వైమానిక దళం సక్సెస్‌ఫుల్‌గా టెస్టు చేసినట్లు రక్షణశాఖ స్పష్టం చేసింది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా చేధించగలదని చెబుతున్నారు.

ప్రయోగం సమయంలో నిర్దేవిత దూరంలోని నౌకను ఈ క్షీపణి పేల్చేసింది. ప్రయోగం సమయంలో బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా తాకినట్లు రక్షణశాఖ తెలిపింది. సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేసింది. సుభోజ్ 30ఎంకేఐ నుంచి లాంచ్ చేసిన తొలి బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్‌టెండ్ రేంజ్ వెర్షన్ ఇదేనని రక్షణశాఖ అధికారులు తెలిపారు. భూమి, సముంద్రం, గాలిలో నుంచి ఈ క్షీపణిని ప్రయోగించే వీలున్నది తెలిపారు.

క్షీపణి ఎక్స్‌టెండెడ్ రేంజ్ ను 290 కి.మీ నుంచి 350 కి.మీలకు పెరిగినట్లు స్పష్టం చేసింది. ఫర్ అండ్ పర్గెట్ సూత్రంపై ఈ క్షీపణి పనిచేయనుందని తెలిపింది.వైమానిక దళం, భారత నౌకాదళం, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవపల్ మెంట్ ఆర్గనైజేషన్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్తంగా ఈ క్షీపణిని ప్రయోగించాయి.

భారత రక్షణ రంగంలో ఇదొక మైలురాయి అని చెప్పవచ్చు. యుద్ద సమయంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిపై కూడా ఈ క్షీపణి కూడా దాడులు చేసే సౌకర్యం అందుబాటులోకి రావడం శుభపరిణామమని చెబుతున్నారు. కాగా యుద్ద విమానం నుంచి మిసైల్ ను ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. గత మేలో ఇలాంటి తరహా పరీక్ష చేసి రక్షణశాఖ విజయవంతమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రయోగం కూడా విజయవంతం కావడంపై సైంటిస్టులకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.