భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయి తాజాగా “బైల్ ఐస్ ది రూల్, జైల్ ఐస్ ది ఎక్సెప్షన్” అనే న్యాయ సిద్ధాంతం మర్చిపోతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 6న కోచ్చిలో జరిగిన 11వ న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ స్మారక లెక్చర్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చగా మారింది. తాజాగా మనీష్ సిసోడియా, కవిత, ప్రబీర్ పుర్కాయస్థ కేసుల్లో ఈ సూత్రాన్ని మళ్లీ న్యాయస్థానాల్లో ప్రాతిపదించామని ఆయన తెలిపారు. విచారణ లేకుండానే సుదీర్ఘంగా అండర్ ట్రయల్స్‌ను జైలులో ఉంచడం అన్యాయమని, ఇది న్యాయ వ్యవస్థ తత్వానికి వ్యతిరేకమని గవాయి స్పష్టం చేశారు.
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ప్రసిద్ధ నరసింహులు కేసును ఉదాహరంగా తీసుకుంటూ జామీన్ మంజూరు చేయాలన్న తీర్పును గుర్తుచేశారు. “బెయిలా లేక జైలా?” అనే ప్రశ్నతో ప్రారంభించిన ఆ తీర్పులో, వ్యక్తి జైలు కాలం, అప్పీల్ నిమిత్తం ఆలస్యం వంటి అంశాల ఆధారంగా జామీన్‌పై మార్గదర్శకాలు ఇచ్చారని చెప్పారు. కఠినమైన షరతులతో జామీన్ విధించడం సమంజసం కాదని, ఆర్థికంగా బలహీనులపై అధిక మొత్తంలో ష్యూరిటీ వేయడం అన్యాయమని గవాయి తెలిపారు. పేదరికానికి శిక్ష విధించాల్సింది కాదు, సమానత్వం చూపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ న్యాయ వ్యవస్థను సామాజిక న్యాయానికి దోహదపడే విధంగా మార్చిన గొప్ప న్యాయమూర్తిగా సీజేఐ గవాయి అభివర్ణించారు. లొకస్ స్టాండీ సూత్రాన్ని విస్తరించి, సామాన్యుల తరపున పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసే మార్గాన్ని చూపారని తెలిపారు. ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు ఇదొక విప్లవాత్మక మార్గం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నితిన్ జామ్‌దార్, న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, మాజీ న్యాయమూర్తి బాలకృష్ణన్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.