Site icon HashtagU Telugu

Suicide : గ్రేట‌ర్ నోయిడాలో విషాదం.. 15 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్య.. కార‌ణం ఇదే..?

Death Representative Pti

Death Representative Pti

గ్రేటర్ నోయిడాలో విషాదం నెల‌కొంది, 15 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను గేమ్ ఆడిన మొబైల్ ఫోన్‌ను రిపేర్ చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి బీటా 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసిస్తున్నాడు. మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడడం అలవాటు చేసుకున్న బాలుడిని కుటుంబ సభ్యులు తరుచూ తిట్టేవారు. బాలుడి మొబైల్ ఫోన్ సక్రమంగా పనిచేయడం మానేయడంతో, ఫోన్ రిపేర్ చేయమని కుటుంబ సభ్యులను పట్టుబట్టినప్పటికీ వారు అందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. బాలుడిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియాన్ ఖాన్ మాట్లాడుతూ, 15 ఏళ్ల బాలుడు తన ఫోన్‌లో గేమ్స్ ఆడటం అలవాటు చేసుకున్నాడని… కుటుంబ సభ్యులు తన ఫోన్‌ను రిపేర్ చేసేందుకు నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. తదుపరి విచారణ జరుగుతోందని డీసీపీ సాద్ మియాన్ ఖాన్ తెలిపారు.