Chhota Rajan : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయిపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ ఒకప్పటి అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌పై సంచలన అప్‌డేట్ వచ్చింది. 2001 నాటి ఒక కేసులో అతడికి బాంబే హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. ఛోటా రాజన్‌కు జీవితఖైదు శిక్షను విధిస్తూ ఆనాడు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. చాలా కేసుల్లో ఇరుక్కొని జైలులో ఉంటున్న ఛోటా రాజన్‌కు ఈ తీర్పు ఊరటనిచ్చేది అని పరిశీలకులు అంటున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. రూ.లక్ష బాండ్‌ను సమర్పించి ఛోటా రాజన్ బెయిల్ పొందొచ్చని బెంచ్ పేర్కొంది. అయితే రాజన్‌పై ఇతరత్రా చాలా క్రిమినల్ కేసులు ఉన్నందు వల్ల ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
Also Read :Earth Vs Asteroids : భూమికి చేరువగా ఆరు ఆస్టరాయిడ్లు.. ఏం జరగబోతోంది ?
ఏమిటీ కేసు.. 2001లో ఏం జరిగింది ?
- సెంట్రల్ ముంబయిలోని గామ్‌దేవి ప్రాంతంలో ‘గోల్డెన్ క్రౌన్’ హోటల్ ఉంది.
- ఆ హోటల్ యజమాని పేరు జయశెట్టి.
- 2001న మే 4న ‘గోల్డెన్ క్రౌన్’ (Chhota Rajan) హోటల్ మొదటి అంతస్తులో జయశెట్టిపై ఛోటా రాజన్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు కాల్పులు జరిపారు.
- హేమంత్ పూజారి..ఛోటా రాజన్ ముఠా సభ్యుడు.
- డబ్బులు ఇవ్వాలంటూ.. హేమంత్ పూజారి నుంచి జయశెట్టికి బెదిరింపు కాల్స్ వచ్చాయని విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. డబ్బులు చెల్లించేందుకు జయశెట్టి నిరాకరించడంతో హత్య చేశారని పేర్కొన్నారు.
- ఈ కేసును అప్పట్లో విచారించిన మకోకా (ఎంసీవోసీఏ) కోర్టు.. ఛోటా రాజన్‌తో పాటు మరికొందరిని దోషులుగా తేల్చి, వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
- తన శిక్షను రద్దు చేసి, బెయిల్ ఇవ్వాలంటూ బాంబే హైకోర్టులో ఛోటా రాజన్ అప్పీల్ చేశారు.
- ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జే డేను హత్య చేసిన కేసులో ఛోటా రాజన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు.
- గత 20 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ప్రసాద్ పూజారిని ఈ ఏడాది మార్చిలోనే ముంబై క్రైం పోలీసులు ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చారు. చైనా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకొచ్చి అరెస్టు చేశారు.