విప్లవ కవి వరవరరావుకి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని NIA ని బాంబే హైకోర్టు ఆదేశించింది. మెడికల్ టెస్ట్ లకు అయ్యే ఖర్చులనుకూడా ఎన్ఐఏ భరించాలని ఆదేశాలిచ్చింది. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. కేసు, ఆ నిర్బంధం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది.
36 నెలలలో ఆయన పదిహేను నెలలు పూణేలోని యరవాడ జైలులో, ఎనిమిది నెలలు నవీ ముంబాయిలోని తలోజా జైలులో, నాలుగు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో ముంబాయి లోని ఆస్పత్రులలో, ఎనిమిది నెలలు గృహనిర్బంధం లాంటి మధ్యంతర బెయిల్ పై గడిపారు. ఎన్నో ప్రయత్నాల తరువాత బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను రెండుసార్లు పొడిగించింది. ఈ నేపథ్యంలో వరవరరావుకి ఈనెల 13న సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే ఎన్ఐఏ ఆయన ఆరోగ్యం బాగానే వుందని వాదించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ మీరే నానావతి ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను వాయిదా వేసింది