Site icon HashtagU Telugu

Bomb Threats : ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు

Bomb threats to several schools in Delhi.. Police on high alert, checks

Bomb threats to several schools in Delhi.. Police on high alert, checks

Bomb Threats : ఢిల్లీ నగరాన్ని మరోసారి బాంబు బెదిరింపులు కలవరపెట్టాయి. గతంలో వచ్చిన తరహాలోనే, సోమవారం ఉదయం ఢిల్లీ నగరంలోని రెండు ప్రముఖ పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు పంపించారు. దీంతో పోలీస్ శాఖ వెంటనే స్పందించి, అప్రమత్తంగా చర్యలు చేపట్టింది. ఈ ఉదయం చాణక్యపురిలో ఉన్న నేవీ స్కూల్, ద్వారకలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబులు స్కూల్ ప్రాంగణంలో ఉంచబడ్డాయని ఆగంతకులు హెచ్చరించారు. దీనితో బెంబేలెత్తిన పాఠశాల యాజమాన్యాలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.

Read Also: Starlink : భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్‌ షెడ్యూల్‌, ధరలు ఇవే!

వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకున్న ఢిల్లీ పోలీస్‌ దళాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ప్రదేశాన్ని చుట్టుముట్టి సంపూర్ణ తనిఖీలు ప్రారంభించాయి. విద్యార్థులను తాత్కాలికంగా తరలించి, భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా పరిశీలనలు కొనసాగించాయి. అయితే ఈ సుదీర్ఘ తనిఖీల అనంతరం, బాంబ్ స్క్వాడ్ ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ కనుగొనలేకపోయింది. ఈ బెదిరింపులు ఓ మాయ ఫోన్ కాల్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలాంటి పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లల భద్రతే మొదటి ప్రాధాన్యం. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు అనే విషయం తేల్చే వరకు మనం నిర్లక్ష్యం చేయలేం అని ఒక తల్లిదండ్రి పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కాల్ చేసిన వ్యక్తులపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. పాత బెదిరింపుల తరహాలోనే ఇదీ ఆపరేట్ అయిందా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో స్కూల్‌లకు బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, విద్యాసంస్థల భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పాఠశాలల్లో భద్రతా విధానాలు మరింత కఠినతరం చేసే అవకాశాలున్నాయి. తాత్కాలిక భద్రత మేయర్స్ కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also: Parliament : రాజ్యసభ – లోక్‌సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?