Site icon HashtagU Telugu

Bomb Threat : ఢిల్లీలోని రామ్‌ లాల్‌ ఆనంద్‌ కళాశాలకు బాంబు బెదిరింపు

Bomb Threat To Ram Lal Anan

Bomb Threat To Ram Lal Anan

 

Bomb Threat : దేశంలో గత కొంత కాలంగా దేశంలోని పలువురు వ్యక్తులు, పలు నగరాలు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు(Bomb Threat) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలోని (University of Delhi) రామ్‌ లాల్‌ ఆనంద్‌ కళాశాల (Ram Lal Anand College)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం 9:34 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి కళాశాలలో బాంబు పెట్టినట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, సిబ్బందిని కళాశాల నుంచి బయటకు పంపించేశారు. అనంతరం బాంబ్‌ స్వ్కాడ్‌ సాయంతో (Bomb Disposal Squad) కళాశాల ఆవరణలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

read also : Covid Cases: ఉత్త‌రాది రాష్ట్రాల్లో మ‌ళ్లీ కోవిడ్ కేసులు