Site icon HashtagU Telugu

Bomb Threat Emails : కాన్పూర్, లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అక్కడి నుంచే ఈమెయిల్స్!

Bomb Threat Emails

Bomb Threat Emails

Bomb Threat Emails : బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, జైపూర్, అహ్మదాబాద్‌‌లలోని స్కూళ్లకు కొన్నిరోజుల క్రితం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. మూడు రోజుల క్రితమే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు 10కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.  వాటిని మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న 10 ప్రముఖ పాఠశాలలకు,  లక్నోలోని నాలుగు ప్రైవేట్ పాఠశాలలకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు(Bomb Threat Emails) వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఈమెయిల్స్‌ను చెక్ చేసిన పోలీసులు..  అవి రష్యా సర్వర్ల నుంచి వచ్చాయని తెలిపారు.  ashuashu ashuashu90@gmail.com, instrumenttt@inbox.ru అనే ఈమెయిల్స్ నుంచి బెదిరింపు మెసేజ్‌లు స్కూళ్లకు వచ్చాయని పోలీసులు గుర్తించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర కుమార్ ఫిర్యాదు ఆధారంగా ఈ రెండు వెబ్‌సైట్‌లపై గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీటిలో  ఒకటి రష్యా సర్వర్ నుంచి.. మరొకటి జీమెయిల్ నుంచి వచ్చాయి.

Also Read : KTR : ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాణ్.. అచ్చంపేట ఘటనపై కేటీఆర్ ట్వీట్

మే 12న సాయంత్రం 6.46 గంటలకు ashuashuashuashu90@gmail.com అనే ఈమెయిల్ నుంచి లక్నోలోని గోమతి నగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలకు  బెదిరింపు సందేశం వచ్చింది. స్కూలులో బాంబు పేలుడు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మే 13న ఉదయం 7.58 గంటలకు అదే పాఠశాలకు instrumenttt@inbox.ru అనే ఈమెయిల్ నుంచి మరో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నోలోని మరిన్ని పాఠశాలలకు కూడా ఇదేవిధమైన బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.  ‘‘2015లో జరిగిన పారిస్‌ ఉగ్రదాడులను తలపించేలా బాంబు దాడులు ఉంటాయి.. ఉగ్రవాది అబ్దెల్‌హమిద్ అబావుద్ స్ఫూర్తితో ఈ దాడికి ప్లాన్ చేస్తున్నాం’’ అని ఈ బెదిరింపు సందేశాల్లో ప్రస్తావించారు.  దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాఠశాలల ఆవరణ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు.

Also Read :PM Modi : ‘‘ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు’’ అంటే ముస్లింలే కాదు.. పేదలు కూడా : మోడీ