Site icon HashtagU Telugu

Bomb scare at Dadar station: రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

Mumbai

Resizeimagesize (1280 X 720) 11zon

ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ (Dadar station) వద్ద బాంబు కలకలం రేపింది. ఈ రైల్వే స్టేషన్ వద్ద ఓ అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఆ బ్యాగును పరిశీలించగా అందులో బాంబు ఉన్నట్లు గుర్తించారు. రైల్వేశాఖ అధికారుల సమాచారంతో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ దాదర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.

ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద బ్యాగ్ దొరికింది. టికెట్ కౌంటర్‌లో ఈ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. రైల్వే పోలీసులు, ముంబై పోలీసుల బృందం సంఘటనా స్థలానికి బాంబు నిర్వీర్య దళాన్ని పిలిపించారు. దాదర్ రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ వద్ద లభించిన బ్యాగ్‌ను బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ పరిశీలించగా లోపల అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో తెలిపారు.

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్ కౌంటర్ దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కనిపించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్ స్క్వాడ్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లగా, రైల్వే పోలీసులతో పాటు సిటీ పోలీసులను సంఘటనా స్థలంలో మోహరించారు. జార్ఖండ్‌ నుంచి త్రివేండ్రం వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్‌ని వదిలివెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.