పంజాబ్‌లోని భాక్రా కెనాల్ (Bhakra canal)లో ఓ స్కూబా డైవర్‌కి వింత వస్తువు దొరికింది. అది బాంబులా ఉందని, దాని బరువు 20-25 కిలోలు ఉటుందని సదరు స్కుబా డైవర్ తెలిపాడు. భాక్రా కెనాల్ (Bhakra canal)లో అటువంటి వస్తువులు మరిన్ని ఉన్నాయని వెల్లడించాడు. తనకు దొరికిన వస్తువును పోలీసులకు అందజేశానని చెప్పాడు.
పంజాబ్‌లోని నాభా రోడ్ ప్రాంతంలోని భాక్రా కాలువలో 20 నుంచి 25 కిలోల బరువున్న బాంబు లాంటి వస్తువు దొరికింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఒక స్కూబా డైవర్ కాలువలో ఈ బాంబు లాంటి వస్తువును కనుగొన్నాడు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ భరద్వాజ్ అనే ఈ డైవర్ కాల్వలో ఇలాంటివి మరిన్ని ఉండొచ్చు అంటున్నారు. సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ, డైవర్లు, ఆయుధ నిపుణులను సంఘటనా స్థలానికి రప్పించారు. ఫిరంగి బంతిలా కనిపిస్తున్న ఈ విషయం ఏంటనేది ఆరా తీస్తున్నారు. దాన్ని దాచడానికి నీళ్లలో వేసారా? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు లాంటి ప్రశ్నలన్నింటికీ పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు.
Also Read: China Border Issue: చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో దుమారం
సిద్ధూ ముసేవాలా హత్య తర్వాత పంజాబ్ ప్రభుత్వం ఇక్కడి తుపాకీ సంస్కృతి, ఉగ్రవాద శక్తులపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఎవరైనా పట్టుబడతారేమోననే భయంతో కాల్వలో పడేసినట్లు వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసు బృందం అక్కడే మోహరించింది. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. డిసెంబర్ 18న గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌లు కనిపించాయి. చందు వడాలా అవుట్‌పోస్ట్, కసోవాల్ ఔట్‌పోస్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్‌లు కనిపించడంతో BSF సిబ్బంది పరిసర ప్రాంతాల్లో శోధన ఆపరేషన్ ప్రారంభించారు. పాక్ డ్రోన్ లోపలికి రాకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు.