China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 133 మందిలో ఒక్క‌రైనా బ‌తికారా..?

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 04:18 PM IST

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్‌ కంపెనీకి చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూల‌డంతో, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 133మంది మరణించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గువాన్‌ఝూ నుంచి బయలుదేరిన కాస్సేపటికే ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం MU5736 పర్వతాన్ని ఢీకొట్టి కుప్పకూలినట్టు సమాచారం. ప్ర‌మాదం ధాటికి విమానం పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఇక ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలు కార‌ణంగా అక్క‌డ అడవి అంతా అలముకున్నాయి.

ఇక ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీమ్‌లను ఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన అడవిలో భారీగా మంటలు, పొగ అలముకోవడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. ఎందుకంటే విమానం క్రాష్ కావడం ద్వారా చెలరేగిన మంటలు ఆ అడవి అంతా విస్తరించాయి. ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానం కేవలం ఆరేళ్ల క్రితం తయారైంది. గతంలో 2018లో బోయింగ్ 737 మ్యాక్స్ ఆపరేట్ చేస్తున్న లయన్ ఎయిర్‌ఫ్లైట్ 610 ప్రమాదానికి గురైంది.

ఆ తరువాత 2019లో అదే మ్యాక్స్ సంస్థకు చెందిన మరో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఇక‌పోతే షాంఘైకి చెందిన చైనా ఈస్టర్న్ కంపెనీ చైనాలోని మూడు అగ్ర విమానయాన సంస్థలలో ఒకటి. ప్రమాదానికి గురైన విమానాన్ని 2015లో బోయింగ్ సంస్థ చైనా ఈస్టర్న్ కంపెనీకి డెలివరీ చేసింది. ఈ విమానం ఆరేళ్లుగా సేవలు అందిస్తోంది. ఇందులో రెండు ఇంజిన్‌లు ఉంటాయి. బోయింగ్ 737 ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన విమానాలలో ఒకటి. చైనా ఈస్టర్న్ కంపెనీ 737-800, 737 మాక్స్‌తో సహా సాధారణ విమాన సేవలను సైతం అందిస్తోంది.