Site icon HashtagU Telugu

Wayanad Landslides : నది వరద ప్రవాహం లో కొట్టుకు వస్తున్న శవాలు

Body Parts Recovered From C

Body Parts Recovered From C

ఇటీవల కేరళలోని వయనాడ్‌(Wayanad )లో కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 400 కు పైగా ప్రజలు మరణించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు కానరాకుండాపోయాయి. ఈ విషాద ఘటన జరిగి రోజులు గడుస్తున్న గల్లంతైన మరో 170 మంది కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో పోలీసులే , ఆర్మీ , పలు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. నిన్నటి నుండి చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు కొట్టుకుని వస్తుండడంతో, ప్రత్యేక బృందాల సాయంతో దాదాపు 1200 మంది గాలిస్తున్నారు. శరీర అవయవాలు ఎవరివన్నది గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటె కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వారికి అధికారులు సామూహికంగా అంత్యక్రియలు జరిపించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా మృతదేహాలను గుర్తించడానికి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పుతుమాలలో జిల్లా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఎవరు ఏ మతమో తెలియనందున అన్ని మతాల ప్రార్థనలతో అందరి అంత్య క్రియలు ఒకేచోట నిర్వహించారు.

Read Also : Vinod Kambli : న‌డ‌వ‌లేని స్థితిలో స‌చిన్ స్నేహితుడు.. ఇత‌డు మాజీ భార‌త స్టార్ ఆట‌గాడు కూడా..