RajyaSabha Polls: రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ..16 స్థానాల్లో ఎనిమిది కైవ‌సం చేసుకున్న బీజేపీ

హోరాహోరీగా సాగిన‌ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు శనివారం తెల్లవారుజామున వెలువ‌డ్డాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా కర్నాటక ఈ నాలుగు రాష్ట్రాల్లోని 16 స్థానాలకు ఎన్నికలు జరగ‌గా.. బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఐదు స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది.

  • Written By:
  • Updated On - June 11, 2022 / 12:27 PM IST

హోరాహోరీగా సాగిన‌ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు శనివారం తెల్లవారుజామున వెలువ‌డ్డాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్నాటక ఈ నాలుగు రాష్ట్రాల్లోని 16 స్థానాలకు ఎన్నికలు జరగ‌గా.. బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఐదు స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల‌ను మహారాష్ట్ర మిత్రపక్షాలు శివసేన, ఎన్‌సిపి, హర్యానా నుండి బిజెపి మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల‌ మహారాష్ట్ర అధికార కూటమికి ఎదురుదెబ్బ త‌గిలింది, బిజెపి మ‌హారాష్ట్ర నుండి ఆరు రాజ్యసభ సీట్లలో మూడింటిని కైవసం చేసుకుంది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన తర్వాత కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది.ఎనిమిది గంట‌ల త‌రువాత ఫలితాలు ప్రక‌టించారు

బీజేపీ విజేతల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహదిక్ ఉన్నారు. ఎంవీఏ కూటమి బరిలోకి దిగిన అభ్యర్థుల్లో శివసేనకు చెందిన సంజయ్ రౌత్, ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి విజయం సాధించారు. రాజస్థాన్‌లో పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో మూడు స్థానాల్లో అధికార కాంగ్రెస్ గెలుపొందగా, బీజేపీ ఒకటి దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, బీజేపీకి చెందిన ఘనశ్యామ్ తివారీలు గెలిచిన‌ట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిజెపి మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మీడియా బారన్ సుభాష్ చంద్ర తగినంత సంఖ్యలో ఓట్లు సాధించి ఎన్నికవ్వడంలో విఫలమయ్యారు.

మరోవైపు హర్యానా నుండి రెండు రాజ్యసభ స్థానాలకు బిజెపికి చెందిన క్రిషన్ లాల్ పన్వార్, బీజేపీ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ ఎన్నికైనట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ అధీకృత పోలింగ్ ఏజెంట్ బిబి బాత్రా మాట్లాడుతూ.. ఒక పార్టీ ఎమ్మెల్యే ఓటు చెల్లదని ప్రకటించగా, ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కార్తికేయ శర్మకు క్రాస్ ఓటు వేశారు.కర్ణాటకలో బిజెపి పోటీ చేసిన మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడంతో క్లీన్ స్వీప్ సాధించింది. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు-రాజకీయ నాయకుడు జగ్గేష్, బిజెపి నుండి లెహర్ సింగ్ సిరోయా, కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విజయం సాధించినట్లు ప్రకటించారు.