Explosion: జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)లోని సోపోర్ పట్టణం(Sopore town)లో ఈరోజు(సోమవారం) పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఓ స్క్రాప్ డీలర్ ట్రక్కు నుంచి కొన్ని పదార్థాలు దించుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నజీర్ అహ్మద్ నద్రో (40), అజీమ్ అష్రఫ్ మీర్ (20), ఆదిల్ రషీద్ (23), మహ్మద్ అజార్ (25) పోలీసు అధికారులు గుర్తించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు సోపోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దివ్య తెలిపారు. అయితే ఈ పేలుడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భారీ శబ్దం రావడంతో.. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సోపోర్ పట్టణం తిరుగుబాటు మధ్య కాశ్మీర్ లోయలో వేర్పాటువాద హింసకు కేంద్రంగా ఉంది. ఈ పట్టణానికి చెందిన కరడుగట్టిన వేర్పాటువాద నాయకుడు, దివంగత సయ్యద్ అలీ గిలానీకి కూడా ఈ ప్రాంతం రాజకీయ కోటగా ఉంది.