Site icon HashtagU Telugu

Blast: గుజరాత్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

China Explosion

Bomb blast

గుజరాత్‌ (Gujarat) లోని వల్సాద్ జిల్లాలోని సరిగామ్ జిఐడిసి వద్ద ఒక కంపెనీలో పేలుడు (Blast) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. మంగళవారం ఉదయం నుంచి మరోసారి సహాయక చర్యలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గుజరాత్‌లోని వల్సాద్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానం.

వల్సాద్ ఎస్పీ విజయ్ సింగ్ గుర్జార్ తెలిపిన వివరాల ప్రకారం.. సరిగామ్ జిఐడిసిలోని వాన్ పెట్రో కెమికల్ కంపెనీలో పేలుడు సంభవించింది. దాని కారణంగా మంటలు చెలరేగాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. 2 మృతదేహాలను వెలికితీశారు. అయితే మృతదేహాలను గుర్తించలేదని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ సహాయక చర్యలు ప్రారంభిస్తారు. రాత్రి కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.