Yogi Vs Ajit Pawar : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ అధికార ‘మహాయుతి’ కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ‘బటేంగే తో కటేంగే’ (విడిపోతే.. దెబ్బతింటాం) అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే హర్యానా అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన నినాదంతో ఎన్‌సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విభేదించారు. అలాంటి నినాదాలు మహారాష్ట్రలో పనిచేయవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో అలాంటి నినాదాలు ఇవ్వడం సరికాదన్నారు. అభివృద్ధి, ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలను ప్రసంగాల్లో ప్రస్తావిస్తే సరిపోతుందని సీఎం యోగికి(Yogi Vs Ajit Pawar) హితవు పలికారు. అయితేే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి చోట్ల యోగి ఇచ్చిన నినాదాలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
Also Read :Girls Marriage : తొమ్మిదేళ్ల బాలికలనూ పెళ్లాడొచ్చు.. వివాదాస్పద చట్ట సవరణ!
ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలోనే అజిత్ పవార్ ఉన్నారు. సాక్షాత్తూ మిత్రపక్ష నేత అజిత్ పవార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మహారాష్ట్ర బీజేపీ క్యాడర్ షాక్‌కు గురైంది. ఇంతకీ అజిత్ పవార్ మనసులో ఏం నడుస్తోంది ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ? అనే దానిపై చర్చ మొదలైంది. ‘‘కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కులగణన పేరుతో హిందువులను విభజించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విభజన రాజకీయాల బారిన మనం పడకూడదు. హిందువులమంతా కలిసి ఉంటేనే బలంగా ఉంటాం. విడిపోతే దెబ్బతింటాం’’ అని ఇటీవలే హర్యానా ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి కామెంట్ చేశారు. కులగణన అంశానికి ప్రాధాన్యత పెరిగిన తరుణంలో తనదైన శైలిలో సీఎం యోగి ‘బటేంగే తో కటేంగే’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో హర్యానా అసెంబ్లీ పోల్స్‌లో బీజేపీ చాలా ప్రాంతాల్లో మంచి ఫలితాలను సాధించగలిగింది. ఇటీవలే ప్రధాని మోడీ సైతం ప్రసంగిస్తూ.. “ఏక్ హై తో సేఫ్ రహేంగే” అని ఓటర్లకు పిలుపునిచ్చారు.