BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 08:46 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిజెపి (BJO)..రెండో జాబితా (2nd List) ను బుధువారం రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో 195 మందిని ప్రకటించిన బిజెపి..రెండో జాబితాలో 72 మందిని (Candidates ) ప్రకటించారు. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి గోడెం నగేశ్‌, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్‌, మెదక్‌ ఎం రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్‌ డీకే అరుణ, నల్గొండ సైదిరెడ్డి, మహబూబాబాద్‌ అజ్మీరా సీతారాం నాయక్‌ అభ్యర్థులుగా ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచింది. ఇప్పటివరకూ 267 మంది అభ్యర్థులను బిజెపి ప్రకటించినట్లు అయ్యింది. రెండో జాబితా చూస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నాగ్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, హవేరీ నుంచి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, బెంగళూరు సౌత్‌ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉత్తరాఖండ్ లోని గర్హవాల్ నుంచి అనిల్ బలూని, కర్ణాల్ నుంచి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అంబాలా నుంచి బాంటో కటారియా, గురుగ్రామ్ నుంచి రావు ఇంద్రజిత్ సింగ్ యాదవ్, ఫరీదాబాద్ నుంచి క్రిషన్ పాల్ గుర్జార్, సిర్సా నుంచి అశోక్ తన్వర్, భివానీ- మహేంద్రగఢ్ నుంచి ధరంబీర్ సింగ్, ఫరీదాబాద్ నుంచి క్రిష్ణన్ పాల్ గుర్జార్ లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొత్తం మీద రెండో లిస్ట్ లో కేంద్ర మంత్రులకు , మాజీ సీఎం లకు ఛాన్స్ ఇచ్చి నేతల్లో ఉత్సహం..కార్యకర్తల్లో జోష్ నింపారు.

Read Also : Lok Sabha Elections : మరో ఇద్దర్ని ప్రకటించిన కేసీఆర్