Women Reservation Bill: మహిళ బిల్లుపై బీజేపీ నేత ఉమాభారతి అసంతృప్తి

రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ మరియు అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై వెనుకబడిన కేటగిరిలు అసంతృప్తితో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Women Reservation Bill

Women Reservation Bill

Women Reservation Bill: రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభ మరియు అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై వెనుకబడిన కేటగిరిలు అసంతృప్తితో ఉన్నారు. వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మహిళలకు కోటా కల్పించకపోవడం పట్ల బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను అయితే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం కొంత నిరుత్సాహానికి గురయ్యాను అని చెప్పారు. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోతే, బీజేపీపై వారి విశ్వాసం దెబ్బతింటుంది అని స్వయంగా బీజేపీకి చెందిన ప్రముఖ ఓబీసీ నాయకురాలు భారతి పేర్కొన్నారు. గతంలో లోక్‌సభలో ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారని గుర్తు చేస్తూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని ఆదుకుంటారని నాకు నమ్మకం ఉంది. నేను ఉదయం ప్రధానమంత్రికి లేఖ రాశాను మరియు బిల్లు ప్రవేశపెట్టే వరకు మౌనం వహించాను అని అన్నారు. వెనుకబడిన తరగతుల మహిళలకు బిల్లులో అవకాశం లేకపోవడంతో నిరాశకు గురయ్యారమే.

Also Read: TDP MLA : వైసీపీ ఎంపీలు రాష్ట్రం ప‌రువు తీస్తున్నారు : టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌

  Last Updated: 19 Sep 2023, 11:01 PM IST