Rahul Gandhi: ఆదివాసీలను బీజేపీ అవమానించింది: రాహుల్

ఆదివాసీలను అడవులకు పరిమితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi: ఆదివాసీలను అడవులకు పరిమితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివాసీలకు బదులుగా వనవాసీ అని పిలవడం ద్వారా బిజెపి గిరిజన సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. వాయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలోని నల్లూర్‌నాడ్‌లోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్‌లో హెచ్‌టి కనెక్షన్‌ను ప్రారంభించారురాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీజేపీ పై మండిపడ్డారు. ఆదివాసీలను అడవులకు పరిమితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. వనవాసి అనే పదం గిరిజన వర్గాల చరిత్రను వక్రీకరించడమని అన్నారు. ఈ సందర్భంగా అటవీ భూములకు ఆదివాసీలు యజమానులు అని ఆయన అన్నారు. ఈ మేరకు భూమి మరియు అడవులపై వారికీ పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ విద్య, ఉద్యోగాలు మొదలైన అన్ని అవకాశాలను వారికి ఇవ్వాలని తెలిపారు.

క్యాన్సర్‌ సెంటర్‌కు సంబంధించి కాంగ్రెస్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్‌ కోతలతో వైద్యులు, రోగులు పడుతున్న ఇబ్బందులకు కొత్త విద్యుత్‌ కనెక్షన్‌తో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయడం సంతోషకరమని, జిల్లా అధికారులు చేస్తున్న కృషి ఫలితంగా ఆస్పత్రికి రూ.5 కోట్లు అదనంగా వస్తుందన్నారు.

Also Read: Abdul Kalam-Grinder : అబ్దుల్ కలాం.. ఒక చెక్కు.. ఒక గ్రైండర్.. స్ఫూర్తి రగిల్చే స్టోరీ