Site icon HashtagU Telugu

BJP Vs Rahul: బ్రిటన్ ఎంపీతో రాహుల్ ఫొటో…భారత వ్యతిరేక శక్తులతో కలిసారంటూ బీజేపీ ఆరోపణ..!!

Rahul

Rahul

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ పర్యటన పలు వివాదాలకు తావిస్తోంది. విదేశీవేదికల సాక్షిగా భారత్ లో అధికార బీజేపీపై విషం వెళ్లగక్కారు రాహుల్. ఆ దేశాల్లో పరువు తీస్తున్నారంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ సహా భారత్ కు చెందిన రాజకీయనేతలు, ఇతర ప్రముఖులు లండన్ చేరారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా లండన్ లో పలు సభల్లో పాల్గొన్నారు రాహలు.

భారత్ లో అధికార పక్షం బీజేపీ, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా బ్రిటన్ ఎంపీ జెరేమీ కార్బిన్ ను కలిసిన రాహుల్ …ఆయనతోకలిసి ఫోటో దిగారు. ఆ ఫోటోలో రాహుల్ సన్నిహితుడు శ్యాం పిట్రోడా ఉన్నారు. కాగా బ్రిటన్ ఎంపీ గతంలో జమ్ము కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సపోర్టు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ కార్బిన్ తో భేటీ కావడంపై బీజేపీ నేతలు స్పందించారు.

యూకే ఎంపీ, లెబర్ నాయకుడు జెరెమీ కార్బిన్ భారత్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇస్తున్నారు. హిందూ ద్వేషి, తీవ్రవాద సానుభూతిపరుడు. కాంగ్రెస్ నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ కు అతనితో ఏం పని …మరో టూల్ కిట్ తో భారత్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడా అని బీజేపీ కర్నాటక రాష్ట్ర విభాగం ట్వీట్ చేసింది.

దీనిపై రాహుల్ స్నేహితుడు శ్యాం పిట్రోడా స్పందించారు. అతను నాకు వ్యక్తిగత స్నేహితుడు. హోటల్లో కప్పు టీ కోసం వచ్చాడు. ఇందులో రాజకీయం లేదు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దు. అంటూ ట్వీట్ చేశాడు. ఇక కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కూడా కర్నాటక బీజేపీ నేతలపై మండిపడ్డారు. గతంతో ఎంపీ జెరెమీ కార్బిన్ మోదీని కలిసిన ఫోటోలను ట్వీట్ చేస్తూ…ఇప్పుడేం చెబుతారు అంటూ బీజేపీ నేతలకు కౌంటరిచ్చారు.